నిర్మాతపై పవన్ పిర్యాదు 

Pawan Kalyan complaints on producer

01:08 PM ON 13th January, 2016 By Mirchi Vilas

Pawan Kalyan complaints on producer

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కోపం వచ్చింది. పండగ సమయంలో ఓ నిర్మాత ఇస్తానన్న సినిమా సొమ్ము ఇవ్వకపోవడంతో పిర్యాదు చేసాడు. వివరాలలోకి వెళితే, ప్రముఖ నిర్మాత బి.వి.యస్‌.ఎన్‌ ప్రసాద్‌ ‘అత్తారింటికి దారేది’ చిత్రం రెమ్యునరేషన్‌కు సంబంధించి పవన్ కి బాకీ పడ్డ మొత్తాన్ని ఇంకా చెల్లించలేదట. దీంతో నటుడు పవన్‌ కల్యాణ్‌ మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్ (మా) కి ప్రసాద్పై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రసాద్ తీసిన ‘నాన్నకు ప్రేమతో’ బుధవారం విడుదలైంది. ‘అత్తారింటికి దారేది’ చిత్రం రెమ్యునరేషన్‌లో కొంతభాగం మాత్రమే చెల్లించారని, మిగిలిన సొమ్ము ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదల సమయంలో ఇస్తానని ప్రసాద్‌ తనకు చెప్పారని పవన్‌ కల్యాణ్‌ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే బి.వి.యస్‌.ఎన్‌ ప్రసాద్‌ ప్రస్తుతం ఆ మిగిలిన బకాయి చెల్లించకపోవడంతో 'మా’ను పవన్‌కల్యాణ్‌ ‘ఆశ్రయించారని చెప్పవచ్చు.

English summary

Pawan Kalyan gets angry because of producer. Pawan Kalyan complaints on producer.