'ఖుషి' డైరెక్టర్ తో పవన్ సినిమా కన్ఫర్మ్!!

Pawan Kalyan confirmed to act in S.J. Surya direction

05:55 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Pawan Kalyan confirmed to act in S.J. Surya direction

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒక్కసారిగా స్టార్ హీరోని చేసిన చిత్రం 'ఖుషి'. ఈ చిత్రాన్ని ఎస్.జే సూర్య తెరకెక్కించాడు. ఈ చిత్రంతో సూర్య డిమాండ్ కూడా పెరిగిపోయింది. కానీ ఆ డిమాండ్ ని ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తరువాత తమిళంలో హీరో గా కూడా కొన్ని సినిమా ల్లో నటించాడు. అయితే కొంతకాలం తరువాత 2010 లో పవన్ కళ్యాణ్ తో 'పులి' సినిమా తెరకెక్కించాడు. ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఎస్.జే సూర్య తాజాగా పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఎస్.జే సూర్య పవన్ కళ్యాణ్ కు వినిపించిన కధ నచ్చడంతో పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అంతే కాకుండా ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చెయ్యాలని పవన్ సూచించాడట. ఏప్రిల్ లో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా కి పవన్ అప్పుడే డేట్స్ కూడా ఇచ్చేశాడని సమాచారం. ఈ చిత్రాన్ని సూర్య 'పులి' లా కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని బావిస్తున్నడట. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మిస్తున్న శరత్ మరార్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం పై దృష్టి పెట్టారు. ఈ చిత్రం వేసవి లో విడుదలవబోతుంది.

English summary

Pawan Kalyan confirmed to act his next film in S.J. Surya direction. This movie shooting will starts from april onwards. Pawan already gave dates to S.J. Surya for this prestiguous film.