ట్విట్టర్ లో పవర్ స్టార్ ఇండియా రికార్డు

Pawan Kalyan creates record in twitter

11:48 AM ON 3rd September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan creates record in twitter

ఇప్పటివరకూ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగేంటో చూసారు. ఇప్పుడు అది మరోసారి రుజువుచేస్తూ, పవన్ పుట్టిన రోజు నేపథ్యంలో ఇండియాలో ట్విట్టర్ రికార్డు నమోదైంది. ఇండియాలో అతి పెద్ద ట్విట్టర్ ఫ్యాన్ ట్రెండును పవన్ కళ్యాణ్ అభిమానులు సొంతం చేసుకున్నారు. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ అనే ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ మీద గత నెల రోజుల్లో ఏకంగా 5 లక్షల 50 వేలకు పైగా ట్వీట్లు నమోదయ్యాయి.

1/3 Pages

అజిత్ ని దాటేశాడు...


ఇండియాలో మరే ఫ్యాన్ ట్రెండ్ విషయంలోనూ ఇన్ని ట్వీట్లు నమోదు కాలేదు. ఇప్పటిదాకా రికార్డు అజిత్ అభిమానుల పేరిట ఉంది. అజిత్ పుట్టిన రోజు శభాకాంక్షలు చెప్పేందుకు పెట్టిన హ్యాష్ ట్యాగ్ మీద 4.3 లక్షల ట్వీట్లు నమోదవగా, అజిత్ సినిమా ఎన్నై అరిందాల్ హ్యాష్ ట్యాగ్ కు 5.3 లక్షల ట్వీట్లు వచ్చాయి. దాన్ని హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ దాటేసింది.

English summary

Pawan Kalyan creates record in twitter. Pawan Kalyan fans sent lakhs of tweets in twitter for his birthday.