ఐసీయూలో శిరీష్ ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పవన్!

Pawan Kalyan cried when Allu Sirish was in ICU

04:21 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan cried when Allu Sirish was in ICU

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ది నిజంగా డిఫరెంట్ క్యారెక్టర్. పుస్తకాలు చదవడం, ప్రపంచంలో జరుగుతున్న మార్పులు గమనించడం, తనను తాను సరిదిద్దుకోవడం వంటివి చేస్తుంటాడు. అంతేకాదు, ఎవరితోనూ సంబంధం లేనట్టు, ఎవరినీ పట్టించుకోనట్టూ ఉంటాడు కానీ, అన్నీ గమనిస్తాడు. ఇంకా చెప్పాలంటే, పవన్‌ చాలా సెన్సిటివ్‌ పర్సన్‌ అని, ఎవరికి కష్టం వచ్చినా తట్టుకోలేడని యువహీరో శిరీష్‌ అంటున్నాడు. దానికి ఉదాహరణగా 2007లో జరిగిన ఓ సంఘటనను అతడు చెప్పుకొచ్చాడు. అప్పటికి శిరీష్‌ ఇంకా హీరో కాలేదు. నిజానికి ఆ ఆలోచన కూడా లేదు. ఆ సమయంలో అంటే 2007లో శిరీష్‌ కు యాక్సిడెంట్‌ అయిందట.

అప్పుడు శిరీష్‌ ను ఐ.సి.యు.లో పెట్టారట. ఆ సమయంలో శిరీష్‌ ను పరామర్శించడానికి వచ్చిన పవన్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడట. ‘నిజానికి ఆ సమయానికి పవన్‌ గారితో నాకు పెద్దగా పరిచయం లేదు. అయినా ఆయన చూపిన అభిమానానికి ఆశ్చర్యపోయా. నిజంగా ఆయన చాలా సెన్సిటివ్‌. ఎదుటి వారి బాధలను చూసి తట్టుకోలేడు. ఆ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను' అని శిరీష్‌ చెప్పాడు. అదండీ పవనిజం.

ఇది కూడా చదవండి: గర్ల్ ఫ్రెండ్ తో మొదటిసారి అడ్డంగా దొరికేసిన అఖిల్(ఫోటోలు)

ఇది కూడా చదవండి: ఎవరూ నమ్మలేని భయంకర విషయాలు

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు...

English summary

Pawan Kalyan cried when Allu Sirish was in ICU. In 2007 when Allu Sirish was in ICU Pawan Kalyan saw him and cried a lot.