దాసరి-పవన్ కాంబినేషన్ లో 'సత్యాగ్రహి'

Pawan Kalyan-Dasari Narayana Rao Satygrahi movie

11:18 AM ON 14th May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan-Dasari Narayana Rao Satygrahi movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా 'సత్యాగ్రహి' చిత్రానికి డైరక్టర్ ఫైనల్‌ అయ్యాడని దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రకటించినప్పటికీ ఈ సినిమా పై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా రోజుల క్రిందట పవన్‌కళ్యాణ్‌తో చేయబోయే సినిమా గురించి దాసరి అనౌన్స్‌ చేశారు. అయితే సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. దాసరి నారాయణరావు కేంద్రమంత్రిగా పనిచేసారు. పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా కచ్చితంగా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లోనే ఉండాలి. కానీ దాసరి నారాయణరావు, రాజకీయాలతో సంబంధం లేకుండా మంచి మెసేజ్‌ ఇచ్చే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌నే పవన్‌తో నిర్మిస్తానని చెప్పారు.

ఇది కూడా చదవండి: బన్నీ నా పాలిట దేవుడు(వీడియో)

అయినప్పటికీ పొలిటికల్‌ టచ్‌ పై ఊహాగానాలు ఆగడంలేదు. తాజా సమాచారం ప్రకారం పవన్‌ ఎప్పుడో చేయాల్సిన 'సత్యాగ్రహి' సినిమానే దాసరి నారాయణరావు నిర్మాతగా చేయబోతున్నాడని.. దీనికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇది 2019 ఎన్నికలకు పవన్‌కళ్యాణ్‌ పొలిటికల్‌ ప్రిపరేషన్‌లా ఉంటుందని వినికిడి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు అధికారికంగా ప్రకటించనున్నారు..

ఇది కూడా చదవండి: శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం-భక్తుల పూజలు

English summary

Pawan Kalyan-Dasari Narayana Rao Satygrahi movie. Pawan Kalyan - Dasari Narayana Rao combination movie is Satyagrahi.