పవన్‌ని ఫాలో అవుతున్న కూతురు

Pawan Kalyan daughter Aadhya following his father

03:30 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan daughter Aadhya following his father

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌-రేణు దేశాయ్‌ గారాల కూతురు ఆధ్యా తన తండ్రి పవన్‌ని ఫాలో అవుతుందట. అవును పవన్‌కి బుక్స్‌ చదవడం అలవాటు. పవన్‌ కాలీగా ఉన్నప్పుడు ఎక్కువ పుస్తకాలు చదవడానికే ఇష్టపడతారు. ఇప్పటి వరకు పవన్‌ దాదాపు 2 లక్షల పుస్తకాలు చదివాడంటే పుస్తకాలంటే పవన్‌కి ఎంత మక్కువో అర్ధమవుతుంది. పవన్‌ స్టేజీలపై స్పీచ్‌ ఇస్తున్నప్పుడు ఆ పుస్తకాల జ్ఞానమే ఆ మాటల్లో కనిపిస్తుంది. అలాగే తన తండ్రి దారిలో నడవమని రేను దేశాయ్‌ తన కూతురు ఆధ్యా కి చెప్పిందట. మీ నాన్నగారి లానే నువ్వు కూడా ఎక్కువ పుస్తకాలు చదువు, వీలైనన్ని చదువుతూ ఉండు అప్పుడు నీకు ఎటువంటి ఒంటరి తనము అనిపించదు అని పవన్‌ భార్య ఆధ్యాకి చెప్పిందట.

దీనితో తల్లి మాటలు ఒంట బట్టించుకున్న ఆధ్యా తన తండ్రి బాటలోనే నడవాలని నిర్ణయం తీసుకుందట. పవన్‌లానే పుస్తకాలు చదవడం మొదలు పెట్టిందట. పవన్‌-రేణు దేశాయ్‌ వేరుగా ఉంటున్నా పవన్‌నే ఇన్స్పిరేషన్ తీసుకోమని రేణు దేశాయ్‌ అలా చెప్పడం నిజంగా గొప్ప విషయం.

English summary

Power Star Pawan Kalyan daughter Aadhya following his father way. She also reading lot of books in her father manner.