రామ్ చరణ్ కు రాఖీ కట్టిన పవన్ కళ్యాణ్ కూతురు!

Pawan Kalyan daughter ties Rakhi to Ram Charan Teja

05:28 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Pawan Kalyan daughter ties Rakhi to Ram Charan Teja

మెగా ఫ్యాన్స్ కు వెరీ వెరీ స్పెషల్ ఫోటో ఇది. 'రక్షాబంధనం' పండుగనాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారాల కూతురు, అన్నయ్య రామ్ చరణ్ కు రాఖీ కడుతున్న దృశ్యం ఇది. రామ్ చరణ్ స్వయంగా ఈ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. రక్షాబంధనం రోజున తన సిస్టర్స్ అందరితోనూ రాఖీ కట్టించుకున్నాడు చరణ్. పవన్ అన్నాలెజినోవాల ముద్దుల కూతురు పొలేనా కూడా అన్నయ్య రామ్ చరణ్ కు రాఖీ కట్టడానికి వచ్చింది. పవన్ భార్య లెజినోవానే స్వయంగా పొలేనాను చరణ్ వద్దకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా తీసిన ఓ ఫోటోను ట్విట్టర్ లో పెట్టాడు చరణ్. పొలేనా రామ్ చరణ్ చేతికి రాఖీ కడుతూ ముద్దుముద్దుగా నవ్వుతున్న సీన్ ను ఈ ఫోటోలో చూడవచ్చు.

కాగా, ఈ ఫోటోతో మెగా కుటుంబాల మధ్య ఎంత అనుబంధం వుందో మరోసారి రుజువుచెసినట్లయింది. మెగా బ్రదర్స్ మధ్య వైరం? అని వచ్చే వార్తలకు ఈ ఫోటోతో సమాధనం చెప్పినట్లయింది.

English summary

Pawan Kalyan daughter ties Rakhi to Ram Charan Teja. Pawan Kalyan and Anna Lezhneva daughter Polena ties rakhi to Ram Charan Teja.