అసిస్టెంట్ భార్యకి 25 లక్షలు సాయం చేసిన పవన్

Pawan Kalyan donated 25 lakhs for his assistant cameraman

11:03 AM ON 25th March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan donated 25 lakhs for his assistant cameraman

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు ఎవరు కష్టాల్లో ఉన్నా ముందుండే వ్యక్తి. ఎవరు ఆపదలో ఉన్నా నేనున్నానంటూ ముందుకొచ్చే నటుడు పవన్‌ కళ్యాణ్‌. అందుకే ఆయనకి అంత ఫాలోయింగ్‌, తాజాగా పవన్‌ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఎప్పుడూ ఆపదలో ఆదుకోవడానికి ముందుండే పవన్‌ మరోసారి ముందుకొచ్చారు. తన సినిమాకి అసిస్టెంట్‌ కెమెరామెన్‌ గా పని చేస్తున్న రవి అనే వ్యక్తికి పవన్‌ 25 లక్షల రూపాయలు సహాయం చేశారట. ఈ విషయం కూడా ఒకరు ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తే తెలిసింది. టాలీవుడ్‌లో ఎప్పుడూ ఆపదలో ముందుకొచ్చే హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే.

క్యాన్సర్‌ వ్యాధికి గురైన శ్రీజను పవన్‌ స్వయంగా కలిసి సాయం చేసిన విషయం నుండి... హుదూద్‌, చెన్నై వరదలు విషయాల్లో పవన్‌ ఎంతో సాయం చేశారు. తాజాగా పవన్‌ తన అసిస్టెంట్‌ కెమెరామెన్‌ పనిచేసిన రవి అనే వ్యక్తి భార్యకి గుండె ఆపరేషన్‌ కోసం పవన్‌ 25 లక్షల రూపాయలు సహాయం చేసి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.

English summary

Pawan Kalyan donated 25 lakhs for his assistant cameraman wife for her heart operation.