పవన్ కళ్యాణ్ గుట్టు బయట పెట్టిన వృద్ధురాలు(వీడియో)

Pawan Kalyan donates 1 lakh rupees to oldage home

05:07 PM ON 27th June, 2016 By Mirchi Vilas

Pawan Kalyan donates 1 lakh rupees to oldage home

మంచు లక్ష్మీ ప్రసన్న వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మేము సైతం కార్యక్రమం జెమిని టీవీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. పేదలకు సెలెబ్రిటీలు చేయూతనిచ్చే ఈ కార్యక్రమం అందరినీ బాగా ఆకట్టుకుంది. అయితే నిన్న(26-06-2016) జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఉదార స్వభావం మరోసారి వెల్లడయింది. ఈ కార్యక్రమంలో ఓ మహిళ ఒక వ్రుద్ధాశ్రమం నడపటం కోసం తన పెన్షన్ డబ్బులు సరిపోకపోవడంతో ఒకరి ద్వారా పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లిన వెంటనే పవన్ కళ్యాణ్ ఆమెకు భోజనం పెట్టించి తన అకౌంట్ లోకి ఉన్నపలంగా లక్ష రూపాయలను ఆమెను ఎందుకు, దేనికి అని అడక్కుండానే మనీ ట్రాన్స్ ఫర్ చేయించారట.

ఆమె చెప్పిన వివరాలు ప్రకారం.. ఖమ్మంలో ఆమె వృత్తి రీత్యా టీచర్. అయితే వృద్ధుల కోసం ఆమె వృద్ధాశ్రమం నడుపుతుండేది. కానీ తన రిటైర్మెంట్ అయ్యాక ఇక ఆ ఆశ్రమాన్ని ఎలా నడపాలా అని దిగ్గు తెలియని స్థితిలో పడిపోయింది. ఆ సమయంలో ఎవరో పవన్ కళ్యాణ్ మీకు సాయపడతారని చెప్పారట. అంతే.. ఆమె హైదరాబాద్ వెళ్లి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు గేటు వద్ద తచ్చాడారట. ఆమెను చూసిన పవన్ భార్య గేటు ముందు ఎవరో వృద్ధురాలు తిరుగుతున్నారని చెప్పగానే స్వయంగా బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ వర్షంలో తడుస్తుంటే ఆమెను కారులో కూర్చోబెట్టుకుని తన కార్యాలయానికి తీసుకెళ్లారట.

అక్కడ ఆమె చెప్పిన వివరాలన్నీ తెలుసుకుంటూనే కాఫీ కలిపి ఇచ్చి, చేపల కూర తెప్పించి తనే వడ్డించారట. ఆ సమయంలో ఆమె కాస్త భయపడుతుంటే.. ఎందుకమ్మా భయపడతారు. నేను నీ కొడుకుని.. మీరు నా అమ్మ.. తినండి అంటూ చెప్పారట. ఆమె భోజనం ముగిశాక వృద్ధాశ్రమానికి అవసరమైన లక్ష రూపాయలు ఆమె బ్యాంకు అకౌంట్ లో వేయడమే కాకుండా మరో 10 వేల రూపాయలు ఆమె చేతికి ఇచ్చి పంపారట. ఇది జరిగిన నాలుగైదు సంవత్సరాలు దాటిపోయింది. ఈ విషయాలన్నీ ఆమె చెపుతుంటే అంతా కళ్లార్పకుండా అలా చూస్తుండిపోయారు. దీంతో పవన్ కళ్యాణ్ గొప్పతనమేంటో మరోసారి ఋజువైంది.

English summary

Pawan Kalyan donates 1 lakh rupees to oldage home