పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్‌వి అయ్యుండి నీకు ఇది తగునా !

Pawan Kalyan fan arrested in harassment case

11:50 AM ON 12th March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan fan arrested in harassment case

అవ్వడానికి పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ వీరాభిమాని, అంతేకాదు జనసేన పార్టీలో క్రియాశీల సభ్యుడు. అంత గొప్ప నటుడు అభిమాని కానీ చేసేవన్నీ లోఫర్‌ పనులు. అసలు విషయంలోకి వస్తే విశాఖపట్టణం కి చెందిన చంద్రశేఖర్‌ సాకేటి అక్కడే ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇతని దిన చర్య మాత్రం ఫేస్‌బుక్‌లో అమ్మాయిలని పరిచయం చేసుకోవడం, మాయమాటలతో ఆ పరిచయాన్ని స్నేహం వరకు తీసుకురావడం, ఆ తర్వాత ఆ అమ్మాయిలని బ్లాక్‌మెయిల్‌ చేసి ఏడ్పించడం ఇతగాడి దినచర్య. సోషల్‌ మీడియాలో అమ్మాయిలని బెధిరిస్తున్నాడని ఫిర్యాదు రావడంతో సీనీఎన్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు.

పోలీసులు తెలిపిన వివవరాల ప్రకారం చంద్రశేఖర్‌కి హైదరాబాద్‌ నగరానికి చెందిన ఒక అమ్మాయితో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత ఒకరికొకరు ఇద్దరూ బాగా ఛాటింగ్‌ చేసుకునేవారు. ఆ పరిచయం స్నేహంగా మారడంతో ఒకరికొకరు ఫోన్‌ నెంబర్లు తీసుకున్నారు. చంద్రశేఖర్ సెల్‌ఫోన్‌లో ఆ అమ్మాయి ఫోటోలు తీసుకున్నాడు. ఇదే చనువుతో హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా తనని కలవమని బలవంతం చేసేవాడు. ఆ అమ్మాయి మొదట అంగీకరించకపోయినా ఆ తరువాత రెండు మూడు సార్లు అతన్ని కలిసింది. దీనితో ఇక ఆ అమ్మాయికి ఆ అభిప్రాయం లేకపోయినా ప్రేమ, పెళ్ళి అనే ప్రస్తావన ఎత్తేవాడు.

దీనితో ఆ అమ్మాయి అతనితో మాట్లడడం మానేసింది. ఆ తరువాత ఆ అమ్మాయి దగ్గర తీసుకున్న ఫోటోలు, మెసేజ్‌ లతో అసభ్యకరంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసేవాడు. ఇంక ఆ అమ్మాయి ఆ టార్చర్‌ భరించలేక పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు శేఖర్‌ని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Pawan Kalyan fan and Janasena party member Chandra Sekhar Saketi arrested in woman harassment case. he is working as a software engineer in Vizag.