ఎవరి హీరో గొప్పోడో తెలీదు గానీ... ఓ అభిమాని ప్రాణం పోయింది

Pawan Kalyan Fan Killed In Kolar

10:52 AM ON 23rd August, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Fan Killed In Kolar

మా హీరో గొప్పవాడు..కాదు మాహీరోనే గొప్పవాడు..అని ఇద్దరు అభిమానులు ఎవరికి వారు వాదించుకున్నారు. ఆ వాదన కాస్తా చినికిచినికి గాలివానై ఒక హీరో అభిమాని మరో హీరో అభిమానిని కత్తితో పొడవడంతో అతడు మరణించాడు.వివరాల లోకి వెళ్తే, తిరుపతికి చెందిన వినోద్ రాయల్ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. పార్టీ తరపున తరచూ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఈక్రమంలో ఆదివారం కర్ణాటకలోని కోలార్ లో పవనకల్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన అవయవదాన కార్యక్రమానికి వినోద్ హాజరయ్యాడు. అనంతరం స్నేహితుల నడుమ ఓ యువనటుడు, పవన కల్యాణ్ విషయమై చర్చ జరిగింది. దీంతో తమ హీరో గొప్ప అంటూ ఎవరికి వారు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన ఆ హీరో అభిమాని వినోద్ ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్నేహితులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. సోమవారం నగరంలోని వినోద్ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. జనసేనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వినోద్ మృతి పార్టీకి తీరనిలోటు ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్టు చెప్పారు.

ఇది కూడా చూడండి: ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ

ఇది కూడా చూడండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

ఇది కూడా చూడండి: మీ శరీరంలో తగినంత నీరు లేదని చెప్పే సూచనలు ఇవే

English summary

Tirupati young man his name vinod he is heart core fan of Pawan Kalyan. yesterday he was Killed at Kolar.