సర్దార్ సినిమా కోసం కత్తులతో దాడి.. ఒకరి మృతి

Pawan Kalyan Fan Murdered In A Theater Karnataka

09:47 AM ON 9th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Fan Murdered In A Theater Karnataka

ఉగాది పండుగ నాడు ప్రపంచ వ్యాప్తంగా సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల సందర్భంగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంటే, అనంతపురం మడకశిర సమీపంలోని కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా పావగడ పట్టణంలోని అలంకార్‌ థియేటర్‌లో విషాదం చోటు చేసుకుంది. యువకుల మధ్య జరిగిన ఘర్షణలో రాకేశ్‌ నాయక్‌(20) అనే డిగ్రీ విద్యార్థి మృతిచెందాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన రాకేశ్‌ నాయక్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా చూసేందుకు తన మిత్రులతో స్థానిక అలంకార్‌ థియేటర్‌కు వచ్చాడు. సినిమా చూస్తున్న సమయంలో హీరోని వేరే వర్గం వాళ్లు కామెంట్‌ చేయడంతో... రాకేశ్‌నాయక్‌ వర్గం వారితో ఘర్షణ పడ్డారు. దీంతో ఇరు వర్గాల వారు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రాశేక్‌నాయక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:సర్దార్ మూవీ రివ్యూ

థియేటర్ అద్దాలు పగులకొట్టిన అభిమానులు

కాగా ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలోగల పరమేశ్వరి థియేటర్ అద్దాలను ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్ అభిమానులు పగులకొట్టారు. సినిమా టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నారంటూ... అభిమానులు థియేటర్ అద్దాలు పగులకొట్టారు.

ఇవి కూడా చదవండి:

ముదురు హీరోతో యంగ్‌ హీరోయిన్‌ ప్రేమాయణం

పవన్‌ ఒప్పుకుంటే దానికి కూడా రెడీ అట

టీవీ యాంకర్‌ నగ్న ఫోటోలు లీక్‌ చేసిన ఎక్స్-బాయ్‌ఫ్రెండ్‌

English summary

A Fan was Murdered in Karnataka Ananthapur Border while watching Sardaar Gabbar Singh Movie.The murdered person name was Rakesh Nayak aged 20 years. Police filed case on this issue and searching for accused person in this incident.