పవన్ ఫ్యాన్ హత్య కేసులో అక్షయ్ అరెస్ట్!

Pawan Kalyan fan murderer accused arrest in Bellary

11:51 AM ON 26th August, 2016 By Mirchi Vilas

Pawan Kalyan fan murderer accused arrest in Bellary

ఎవరు గొప్ప హీరో అంటూ వాదులాడుకుని, చివరకు కత్తిపోట్ల వరకూ వెళ్లి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని వినోద్ హత్యకు గురైన సంగతి తెల్సిందే. అయితే హత్య కేసులో ప్రధాన నింధితుడైన అక్షయ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటకలోని బళ్ళారి జిల్లా సండూర్ తాలూకా నర్సాపూర్ గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హత్యకు గురైన వినోద్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ తిరుపతిలో గురువారం స్వయంగా వెళ్లి పరామర్శించి, ఓదార్చాడు కూడా. ఇక ఈ కేసులో అక్షయ్ తో సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు నర్సాపురంలోని నందిని దాబా వద్ద అదుపులోకి తీసుకున్నట్టు చెబుతున్నారు.

అలాగే అటు కూడా మరో ఏడుగురి ప్రమేయం సైతం ఈ కేసులో ఉన్నట్టు తెలిసింది. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా, ఈ ఘటనలో హీరో తారక్ ఎలాంటి కామెంట్ చేయకపోవడం చర్చనీయాంశమైంది. తమ అభిమానులు హింసకు పాల్పడరాదని, అభిమానం దురభిమానంగా మారరాదని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక ప్రకటన చేసి ఉంటే బావుణ్ణు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తమీద ఈ అంశం ఎటు తిరిగి ఎటు వస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: పాపం భార్య శవాన్ని ఒక్కడే 10 కి.మీ మోస్తూ..(వీడియో)

ఇది కూడా చదవండి: జనతా గ్యారేజ్ స్టోరీ లీక్.. స్టోరీ ఇదే..

ఇది కూడా చదవండి: సంతానం కలగకపోవడానికి ఆడ-మగలో అధిక కారణం ఎవరో తెలుసా?

English summary

Pawan Kalyan fan murderer accused arrest in Bellary