బన్నీకి పవర్ స్టార్  ఫ్యాన్స్ వార్నింగ్?

Pawan Kalyan Fans Angry On Allu Arjun

02:49 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Fans Angry On Allu Arjun

మెగా కుటుంబంలో అలజడి రేగిందా... ఎందుకంటే, రీసెంట్ గా సరైనోడు బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇంకా ఆగలేదు. పవన్ ని బన్నీ ఏమీ అనకపోయినా..అసలు పవన్ గురించి మాట్లాడను అంటూ 'చెప్పను బ్రదర్' అన్నాడు అంతే. ఇదిగో ఇదే పవన్ ఫ్యాన్స్ కోపానికి కారణంగా మారింది. రీసెంట్ గా ఓ పబ్లిక్ పోస్టర్ లాంటిది డిజైన్ చేసి, మరీ ఇన్ డైరెక్టుగా బన్నీకి వార్నింగ్ కూడా పవన్ అభిమానులు ఇచ్చేశారు.

ఇవి కూడా చదవండి:భార్యను చంపి సేమ్ 'దృశ్యం' సినిమా కధలా మలిచాడు

చిరుకు పవన్ కళ్యాణ్ పెద్దకొడుకులాంటి చిన్న తమ్ముడు అని అన్నయ్య ఇచ్చిన వారసత్వాన్ని పవన్ తన ప్రతిభతో విస్తరించాడని.. పవన్ అడుగే సంచలనం అని ఇలా చాలా విషయాలు ఆ పోస్టర్ లో చోటుచేసుకున్నాయి. అదే సమయంలో 'పవన్ ఓ శిఖరం.. ఆ శిఖరం గురించి మట్టిదిబ్బలు చెబితే ఏంటి? చెప్పకపోతే ఏంటి? ' అనే కామెంట్ మరీ టూమచ్ అయింది. చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చేసిన కామెంట్ కి ఇది కౌంటర్ అని చెప్పక తప్పదు. 'టన్నుల కొద్దీ ఉన్న దమ్మంతా పోయి.. దద్దమ్మలుగా మిగిలిపోతారు జాగ్రత్త' అనే హెచ్చరిక కూడా ఇందులో ఉందంటే మేటర్ ఎక్కడి దాకా వెళ్లిందో చెప్పనవసరం లేదు.

ఇవి కూడా చదవండి:అది తప్పేలా అవుతుంది అంటున్న అనుష్క

అయితే, చూడడానికి వార్నింగ్ లా అనిపిస్తున్నా.. చిరు - పవన్ లను వేరు చేయద్దంటూ అభిమానులు ఆవేదన చెందడాన్ని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోందని అంటున్నారు. 'మెగా ఫ్యాన్స్ కి చిరంజీవి పవన్ కళ్యాణ్ రెండు కళ్లు.. ఇందులో ఏ కన్నుకైనా అవమానం కానీ అపాయం కానీ తలపెడితే తట్టుకోలేం' అని రాయడం చూస్తే.. చిరు గురించి మాట్లాడి పవన్ గురించి చెప్పను అని అనడం ఎంత ఆగ్రహం కలిగిస్తుందో, దాని ఫలితంగా రగిలిన ఆవేదనే ఈ హెచ్చరిక అని అర్ధం చేసుకోవాలేమో మరి. ఇక భవిష్యత్తులో స్టైలిష్ స్టార్ తన పంధా మార్చుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:భార్యను వ్యభిచారంలోకి దింపిన భర్త.. ఆ తరువాత భర్తకు షాకిచ్చిన భార్య

ఇవి కూడా చదవండి:ఇక పై సినిమాలు చెయ్యనన్న సమంత

English summary

Recently In Allu Arjun's Sarainodu Movie Success meet was Grandly done by the movie unit in Vijayawada and in that function allu arjun denied to talk about pawan kalyan. Now Pawan Kalyan fans were angry on Allu Arjun.