బన్నీని రౌండప్ చేసిన పవన్ ఫ్యాన్స్ (వీడియో)

Pawan Kalyan Fans Attack On Allu Arjun After Khaidi No 150 Pre Release Event

10:54 AM ON 10th January, 2017 By Mirchi Vilas

Pawan Kalyan Fans Attack On Allu Arjun After Khaidi No 150 Pre Release Event

అట్టహాసంగా ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగడం ఓ ఎత్తైతే, అంతకు మించిన వివాదాలను మూటగట్టుకుంది. మెగాబ్రదర్ నాగబాబు యండమూరి, రాంగోపాల్ వర్మపై చేసిన కామెంట్స్ ఇప్పటికే పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఫంక్షన్ లో చిరంజీవి ఓ పవన్ అభిమాని వల్ల ఇబ్బందిపడిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ ఫంక్షన్ కు వచ్చిన అల్లుఅర్జున్ ను కూడా పవన్ ఫ్యాన్స్ వదల్లేదు. ఖైదీ నెం.150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బన్నీ వచ్చాడు. కారులో దిగి వేదిక దగ్గరకు వెళుతుండగా పవన్ ఫ్యాన్స్ అల్లుఅర్జున్ ను చుట్టుముట్టారు. పవర్ స్టార్... పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. అల్లు అర్జున్ ఎటూ కదిలే పరిస్థితి లేకపోవడంతో అలానే చూస్తూ చిరునవ్వులు చిందించాడట. కొద్దిసేపటికి పోలీసుల జోక్యంతో బన్నీ పక్కకు వెళ్లిపోయాడట. పవన్ ఫ్యాన్స్ ఎంత చెప్పినా అల్లుఅర్జున్ పవన్ పేరు చెప్పకపోవడం గమనార్హం.

అయితే,ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. గతంలో పవన్ గురించి బన్నీ ‘చెప్పను బ్రదర్’ అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ వైఖరిపై ఒక మనసు ఆడియో రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ నిప్పులు చెరిగాడు. సరైనోడు ఫంక్షన్ లో పవన్ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో విసిగిపోయి తానలా మాట్లాడినట్లు ఆ తర్వాత అల్లుఅర్జున్ వివరణ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా ఫ్యాన్స్ చూపిస్తున్న అత్యుత్సాహం వల్ల పవన్ కు, మెగా ఫ్యామిలీకి మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోందని, ఇది మంచి పరిణామం కాదని సినీ ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి: మెగా బ్రదర్ పై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్లు

ఇవి కూడా చదవండి: కుండీలో చెత్త వేయండి - ఫ్రీ వైఫై ఇంటర్నెట్ పొందండి

English summary

Power Star Pawan Kalyan has huge fan following and in every mega hero function fans used chant like Power star or Pawan Kalyan and recently Allu Arjun has experienced the same feeling at Chiranjeevi's Khaidi No 150 pre-release event.