అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలికకు ఉల్లిపాయలు అమ్మి తమవంతు సాయం చేసిన పవర్‌స్టార్‌ ఫ్యాన్స్

Pawan Kalyan Fans Sold Onions To Help A Poor Girl

10:50 AM ON 2nd September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Fans Sold Onions To Help A Poor Girl

ఉల్లి ధర ప్రభుత్వాలను వణికిస్తుంది. కొన్ని ప్రభుత్వాలు పడిపోవడానికి ఉల్లి ధరలే కారణం కూడా. అయితే ఇప్పుడు ఉల్లి ధర తారాస్థాయికి చేరుకుంది. కానీ ఇది ప్రభుత్వం పై ప్రభావం చూపడానికి కాదు. అవును, ఓ చిన్నారికి వైద్యం అందించేందుకు ఇలా జరిగింది. పవర్ స్టార్ పవనకల్యాణ్ అభిమానులు చేపట్టిన వినూత్న కార్యక్రమానికి ప్రజలు తమవంతు సాయం అందించారు. ఇంతకీ ఏమిటంటే,

యలమంచిలి మండలం బాడవకు చెందిన లావణ్య ఫాన్సోనిస్ ఎనీమియాతో బాధపడుతోంది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. శస్త్రచికిత్సకు రూ. 12 లక్షలవుతుందని తేల్చారు. కూలీ చేసుకుని బతికే లావణ్య తల్లిదండ్రులకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతల సహకారం కోరారు. ఈ విషయం తెలిసిన పవన్ అభిమానులు.. ఉల్లిపాయలు అమ్మి సాయం చేయాలని భావించారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో దుకాణం తెరిచి, పట్టణమంతా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.

దీనికి స్పందించిన దాతలు కొందరు రూ.200, రూ.500.. 1000 పెట్టి కొంటే మరికొందరు రూ.2 వేలు పెట్టి కొనుగోలు చేశారు. దీంతో తెచ్చిన 100కేజీల ఉల్లిపాయలు గంటలో అమ్ముడైపోయాయి. వీటి ద్వారా రూ.50 వేలు సేకరించారు. ఈ మొత్తాన్ని పవనకల్యాణ్ పుట్టినరోజైన శుక్రవారం చిన్నారి తల్లితండ్రులకు అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:పవర్ స్టార్ .. కాటమ రాయుడే

ఇవి కూడా చదవండి:దెయ్యాలు నివాసముండే ఫేమస్ సిటీస్ ఇవే!

English summary

Pawan Kalyan fans from Vishakapatnam sold Onions to help a poor girl who was suffering with a severe disease. Doctors said that the operation costs 12lakh rupees but the family was living by doing dialy labour. So Pawan kalyan fans sold 100 kilograms of onions and collected 50 thousand rupees in just one hour.