కాల్‌మనీ పై మండిపడ్డ పవన్‌

Pawan Kalyan Fires Call Money Case

05:30 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Pawan Kalyan Fires Call Money Case

జనసేన పార్టీ అధినేత సినీనటుడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ విజయవాడలో గత కొద్ది కాలంగా జరుగుతున్న కాల్‌మనీ వ్యవహారం పై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం . కాల్‌మనీ ఘటనలో వ్యాపారులు మహిళ పై చేస్తున్న అకృత్యాల పై పవన్‌కళ్యాణ్‌ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం .

కాల్‌మనీ వ్యవహారం పై పవన్‌కళ్యాణ్‌ నేరుగా స్పందించక పోయినా ఆయన జనసేన పార్టీ సభ్యులు విజయవాడ లోని మహిళల పై అకృత్యాలకు పాల్పడుతున్న వ్యాపారులను ఉరి తియ్యాలని, ఎన్‌కౌంటర్‌ చేసి పడేయాలని కాళేశ్వరరావు మార్కెట్‌ దగ్గర నిరసన వ్యక్తం చేసారు.

పవన్‌కళ్యాణ్‌ ప్రజల సమస్యలపై పోరాటాలను చేసి ప్రభుత్వాన్ని నిలదీసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఆ మధ్య రాజధాని భూముల విషయంలోను రైతుల ప్రక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్‌కళ్యాణ్‌ ఈ కాల్‌ మనీ విషయం పై ఏ విధంగా నేరుగా స్పందింస్తారో వేచి చూడాలి.

English summary

JanaSena Political party leader power star pawankalyan fires on call money case. Various Janasena party leaders have done rally against call money incident in Vijayawada