బీజేపీ సర్కార్ పై పవన్ షాకింగ్ కామెంట్స్

Pawan Kalyan Fires on BJP Government

12:01 PM ON 28th November, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Fires on BJP Government

పెద్ద నోట్లు రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలపై గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదునైన బాణాలను గత వారం రోజులుగా ట్విట్టర్ లో వదులుతున్నాడు. ఈనేపధ్యంలో మరోసారి స్పందించాడు. తీవ్ర స్థాయిలో తాజాగా కేంద్రంపై వ్యంగమైన వ్యాఖ్యలు చేశాడని చెప్పచ్చు.

బ్యాంకు క్యూ లైన్లలో నిలబడి ప్రజలు చనిపోవడం బాధాకరమన్నారు. డబ్బుల కోసం ప్రజలు పడుతున్న కష్టాలతో తాను చలించిపోయానని పవన్ పేర్కొన్నాడు. కర్నూలులో బ్యాంకు దగ్గర క్యూలో నిలబడి చనిపోయిన బాలరాజు కుటుంబానికి జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి ప్రకటించాడు.

ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడాలని పవన్ కీలక వ్యాఖ్యలు చేస్తూ, అలాగే బీజేపీ నేతలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఏపీ, తెలంగాణ ఎంపీలందరూ బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూలో నిలబడి మద్దతు తెలిపితే ప్రజలకు ధైర్యంగా ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు.

బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వంపై చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జనసేన నేతలు మాత్రం పెద్ద వయసున్న వారికి నోట్ల మార్పిడిలో సహాయం చేశామని చెబుతున్నారు.

అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ లోని పలు బ్యాంకుల్లో పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు కూడా తమ సేవలను ప్రజలకు అందించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మరోసారి పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

English summary

Jana Sena Party President and Cine Hero Power Star Pawan Kalyan was responded on the Currency Issue which was presently the hot topic in All Over India. Pawan Kalyan sais that the BJP MP's and MLA's should have to be come forward and see how people was suffering and he also shared a pic of the Man Who was died in a Bank who went to exchange his money.