సొంత ఊరిలో పవన్ ఫ్లెక్సీలు దహనం

Pawan Kalyan flexies were burned at his hometown

04:19 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan flexies were burned at his hometown

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ స్వగ్రామం అయిన మొగుల్తూరులో పవన్‌కి ఘోర అవమానం ఎదురైంది. వివరాల్లోకెళితే తుని లో జరిగిన కాపు గర్జన వివాదం పై పవన్‌ స్పందించిన తీరు వారికి నచ్చలేదని పవన్‌ పై విరుచుకుపడ్డారు. 'జనసేన' పార్టీ ఒక్క కాపుల కోసమే పెట్టలేదన్న మాటలు వారిని రెచ్చగొట్టేలా చేశాయి. మొగల్తూరు లో కాపు సంఘం నాయకులు పవన్‌ మీద అభిమానంతో కట్టిన ఫ్లెక్సీలను వారే చింపి కాల్చేశారు. కాపుల రిజర్వేషన్‌ కోసం కాపు కులస్థుల మొత్తం పోరాడుతుంటే, తమకు మద్దతు ఇవ్వకపోగా తిరిగి మేము చేసిందే తప్పని అనడంతో పవన్‌ని దారుణంగా దూషించారు. అంతే కాదు సొంత ఊరుకి మెగా బ్రదర్స్‌ ఎప్పుడూ ఏమీ చేయలేదని కనీసం మద్దతు కూడా ఇవ్వలేదని నిప్పులు చరుగుతున్నారు.

అంతే కాదు ఎలక్షన్స్‌ సమయంలో పవన్‌కళ్యాణ్‌ ఏ పార్టీకి మద్దతు ఉంటే ఆ పార్టీకే ఓటు వేసామని ఇప్పుడు తమకి కష్టం వస్తే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary

Power Star Pawan Kalyan flexies were burned by his fans at his hometown Mogaltur due to not supporting his caste reservation incident and issues.