పవన్‌ తప్పు చేస్తున్నాడా?

Pawan Kalyan gave chance to flop director

04:51 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan gave chance to flop director

రామ్‌తో 'కందిరీగ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన సంతోష్‌ శ్రీనివాస్‌ ఆ తరువాత ఎన్టీఆర్‌తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సంతోష్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన 'రభస' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం సంతోష్‌ శ్రీనివాస్‌ పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన 'వేదలం' చిత్రాన్ని పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడని ఈ చిత్రాన్ని ఎస్‌.జె. సూర్య తెరకెక్కిస్తున్నాడని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సంతోష్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయాన్ని విన్న పవన్‌ అభిమానులు మాత్రం పవన్‌ తప్పు చేస్తున్నాడా? అని అనుకుంటున్నారు. ఎన్టీఆర్‌ కి అట్టర్‌ ఫ్లాప్‌ అందించిన సంతోష్‌ పవన్‌కి హిట్‌ ఇస్తాడా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.

English summary

Pawan Kalyan gave chance to flop(Rabhasa) director to remake super hit tamil movie Vedalam in telugu. This movie is not directing by S.J. Surya.