పోటీపై క్లారిటీ ఇచ్చేసిన పవన్!

Pawan Kalyan gave clarity about assembly election

10:48 AM ON 11th November, 2016 By Mirchi Vilas

Pawan Kalyan gave clarity about assembly election

వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ విషయంపై అనంతపురం సభలో క్లారిటీ ఇచ్చేశాడు. తాను గెలుస్తానో లేదో తెలియదు కానీ.. ప్రజలకు అండగా నిలబడతానన్నాడు. ప్రజలు తనకు ఓట్లు వేసినా వేయకపోయినా వారి తరపున పోరాడతానని స్పష్టం చేశాడు. గురువారం అనంతపురంలో పవన్ కళ్యాణ్ సభ నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు. ఇటీవలే పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును హైదరాబాద్ నుంచి ఏలూరుకు మార్చుకునే ప్రయత్నం జరగడంతో 2019 ఎన్నికల్లో పవన్ పోటీకి దిగడం ఖాయమని రాజకీయ పార్టీలు భావించాయి.

ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తాడు అనేది సస్పెన్స్. వెస్ట్ గోదావరి నుంచా అనంతపురం నుంచా అనేది తెలియాల్సి వుంది. ఇప్పటివరకు జనసేన పార్టీ కార్యాలయం హైదరాబాద్ తప్ప ఎక్కడాలేదని, తొలిసారి అనంతపురంలో ప్రారంభిస్తానని పవన్ తెలిపాడు.

1/3 Pages

టిడిపిని దుమ్మెత్తి పోసాడు...


పవన్ కల్యాణ్ తన స్పీచ్ లో టీడీపీ సర్కార్ పై దుమ్మెత్తిపోయారు. సింగపూర్ తరహాలో రాజధాని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నారని, అలాగే తనకూ ఇష్టమేనని అన్నాడు. సింగపూర్ లా చేయడమంటే ఎత్తైన కట్టడాలు, వెడల్పు రోడ్లు కాదని, తప్పు చేస్తే సొంత మనుషులనైనా శిక్షించినప్పుడే అది సాధ్యమవుతుందన్నాడు. రాజధాని కొందరికే పరిమితమన్న ఆరోపణలొస్తున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే వేర్పాటు ఉద్యమాలు వస్తాయని హెచ్చరించాడు. పెట్టుబడిదార్లకే కాకుండా సామాన్యుల రాజధానిగా ఉండాలని కుండబద్దలు కొట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు. రాజధానికి దూరంగా సీమ, ఉత్తరాంధ్రవాసులు వున్నారని, మళ్లీ ప్రత్యేకవాదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే వుందని స్పష్టం చేసాడు.

English summary

Pawan Kalyan gave clarity about assembly election