క్లారిటీ ఇచ్చినా, తికమక పడ్డాడు(వీడియో)

Pawan Kalyan gave clarity on AP special status

06:12 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan gave clarity on AP special status

కాకినాడ సభ తర్వాత జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీవీ ముందుకి వచ్చాడు. టీవీ9 సీఈవో రవిప్రకాష్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్, వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు తనదైన ధోరణిలో మాట్లాడాడు. కొన్ని సూటి ప్రశ్నలకు సమాధానాల్ని ఇవ్వకుండా దాటవేత ధోరణి ప్రదర్శించాడు. భవిష్యత్ కార్యాచరణ పట్ల, వేచిచూద్దామనే ధోరణిలోనే సమాధానాలిచ్చాడు. ఇక క్లారిటీ విషయానికొస్తే, ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తామంటూ వాగ్దానంచేసిన రాజకీయ పార్టీలన్నీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసాడు. భవిష్యత్ పట్ల తనకు స్పష్టమైన క్లారిటీ ఉందని తన యాక్షన్ ప్లాన్ తనకుందని పవన్ చెప్పుకొస్తూ, జనసేన పార్టీ నిర్మాణంపై అడిగిన మరో ప్రశ్నకు అది బహిరంగంగా చెప్పే విషయం కాదు అని వ్యాఖ్యానించాడు.

ఇలా సాగిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలకు ఆచి తూచి స్పందించాలనే ఉద్దేశ్యంతో సరైన మాటలకోసం వెతుక్కుంటూ మౌనంగా ఉండిపోవడం ఈ ఇంటర్వ్యూలో కనిపించింది. మొత్తం మీద తన భవిష్యత్ కార్యాచరణపై పవన్ వేచిచూసే ధోరణిలో ఉన్నట్టు స్పష్టమైంది. బిజెపి, తెలుగుతదేశం పార్టీలు వ్యవహరించే తీరుతెన్నులపైనే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటూ పవన్ తేల్చి చెప్పాడు. మొత్తం మీద కొంచెం క్లారిటీ కన్పించినా, తికమక కూడా ఉండనే వుంది. ఆ ఇంటర్వ్యూ చూస్తే మీకే అర్ధం అవుతుంది.

1/5 Pages

వాళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్లు...


పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని.. అప్పుడప్పుడూ అలా మెరిసి వెళ్లిపోతున్నారని రాజకీయ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ స్పందించారు. ఎవరు ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్. మహాత్మాగాంధీ తరహా నేతలు ఎవరున్నారన్నారని వ్యాఖ్యానించాడు. చంద్రబాబు, సుజనా చౌదరి, టిజి వెంకటేష్ ఇలా ఎవరి వ్యాపారాలు వాళ్లకున్నాయ ని పవన్ అనేశాడు. పొలిటికల్ పార్టీలేవైనా సభలు నిర్వహించాలంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటుందని పవన్ వ్యాఖ్యానించాడు.

English summary

Pawan Kalyan gave clarity on AP special status