హీరోల మధ్య లేని వార్ అభిమానుల మధ్య ఎందుకు: పవన్

Pawan Kalyan gave good warning to fans

01:29 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Pawan Kalyan gave good warning to fans

అభిమానుల మధ్య తమ హీరోల గొప్పతనం, యాక్టింగ్, స్టెప్పులు, ఫైటింగ్ ల గురించి తరచూ వాదనలు జరగడం ఏనాటి నుంచో వుంది. అయితే ప్రస్తుతం గొడవలు ముదిరి హత్యల దాకా చేరుతోంది. వాస్తవానికి హీరోల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. ఒకరి ఇంట్లో ఫంక్షన్ అయితే మరొకరు వెళ్లడం ఆప్యాయంగా పలకరించుకోవడం అన్నీ జరుగుతుంటాయి. ఇంకా చెప్పాలంటే ఉమ్మడి వ్యాపారాలు కూడా వున్నాయి. కానీ అభిమానుల విషయంలో సఖ్యత మాట అటుంచి, రాను రాను గొడవలు మితిమీరిపోతున్నాయి. హత్యల దాకా వెళ్ళిపోయింది. తాజాగా ఫాన్స్ మధ్య వార్ లో పవన్ అభిమాని కత్తిపోట్లకు గురై మరణించిన సంగతి తెల్సిందే.

1/3 Pages

పవన్ స్పందనే అదే...


అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ - హీరోలు - వారి మధ్య గొడవలపై స్పందిస్తూ హీరోలు ఎప్పుడూ పరస్పరం గొడవలు పడరు. హీరోలంతా బానే కలిసి మెలిసి ఉంటారు. కానీ ఆయా హీరోల అభిమానులు మాత్రం గొడవలు పడుతున్నారు. తోటి హీరోలతో తనకు ఎప్పుడూ ఎలాంటి గొడవలు వుండవు అని వివరించారు. సినీ పరిశ్రమలో అందరూ కలిసి మెలిసే ఉంటామని, తమ మధ్య ప్రొఫెషనల్ పోటీతత్వం ఉంటుంది గానీ.. ఇలా గొడవలు పడే స్థాయిలో ఉండవని.. కానీ అభిమానుల మధ్య మాత్రం అలాంటి పరిస్థితులు ఉండటం విషాదకరమని పవన్ విచారం వ్యక్తం చేసారు.

English summary

Pawan Kalyan gave good warning to fans