షకలక శంకర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్

Pawan Kalyan gave serious warning to Shakalaka Shankar

10:21 AM ON 16th March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan gave serious warning to Shakalaka Shankar

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’. 'పవర్' ఫేమ్ కె.ఎస్. రవీందర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ అగర్వాల్, సంజన, రాయ్ లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ స్నేహితుడు శరత్ మారర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఒక విషయం బయటకువచ్చింది. అసలు విషయం లోకి వస్తే సెట్స్‌లో కమీడియన్ షకలక శంకర్‌‌కి పవన్‌కల్యాణ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. ఇంతకీ షకలక శంకర్‌కి పవన్ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడంటే, హైదరాబాద్ సిటీ ఔట్స్కట్స్లో ‘సర్దార్’ షూటింగ్ జరుగుతోంది.

ఇందులో నటించే సీనియర్ నటీనటులకన్నా షకలక శంకర్ సెట్స్‌కి ఆలస్యంగా వస్తాడనే టాక్ సినీ పరిశ్రమలో వుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కో- డైరెక్టర్ ఓ సన్నివేశం సరిగ్గా రాక పలుమార్లు షకలక శంకర్ చేత చేయించాడట. దీంతో షకలక శంకర్ కో-డైరెక్టర్ పై మండిపడ్డాడట. చిత్రం యూనిట్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ షకలక శంకర్ ని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. సన్నివేశం సరిగా వచ్చేవరకు ఎన్నిసార్లు అయినా నటించాల్సిందే, ఇంకోసారి తోక జాడిస్తే ఆ తోకని కత్తెరిస్తానంటూ పవన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారని ఇన్‌సైడ్ టాక్. దీనితో చేసేది లేక షకలక శంకర్ తన అహంకారాన్ని తగ్గించుకున్నాడట.

అయితే గతంలో షకలక శంకర్ పవన్ కోసం గుడి కట్టిస్తానంటూ అప్పట్లో వ్యాఖ్యలు చేశాడు. మరి ఇప్పుడు పవన్ వార్నింగ్ ఇవ్వడంతో గుడి కట్టిస్తాడో లేదో చూడాలి.

English summary

Pawan Kalyan gave serious warning to comedian Shakalaka Shankar. Shakalaka Shankar gave warning to assistant director then Pawan gave warning to Shakalaka Shankar.