ఇంకోసారి 'చెప్పను బ్రదర్' అంటే మీ అన్నకు బాగోదు: పవన్ అభిమాని వార్నింగ్

Pawan Kalyan gave strong warning to Allu Sirish and Allu Arjun

03:39 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Pawan Kalyan gave strong warning to Allu Sirish and Allu Arjun

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసుడిగా సినీ రంగప్రవేశం చేసిన అల్లు శిరీష్ మొదటి రెండు చిత్రాలతో ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు తాజాగా శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యువత, సోలో, ఆంజనేయులు, సారొచ్చారు వంటి చిత్రాలు తెరకెక్కించిన పరశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. దీంతో ఈ చిత్ర దర్శకుడు పరశురాం, హీరో అల్లు శిరీష్ టీవీ9 స్టూడియోకి విచ్చేశారు.

ఈ షోకి వచ్చిన ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఫోన్ చేసి అల్లు అర్జున్ కి, అల్లు శిరీష్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు వేరనే ప్రచారం బయట ఉంది. అలాగే చెప్పను బ్రదర్ అనే మాట చెప్పి మమ్మల్ని బాధ పెట్టొద్దు, తరువాత భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తుండగా కాల్ కట్ అయింది. ఒకసారి ఆ వీడియోపై ఒక లుక్ వెయ్యండి.

English summary

Pawan Kalyan gave strong warning to Allu Sirish and Allu Arjun