అజిత్ తో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకు పవన్ దిమ్మతిరిగే ఆన్సర్!

Pawan Kalyan gives shocking answer for to act with Ajith

10:13 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Pawan Kalyan gives shocking answer for to act with Ajith

ఓ మాదిరి హీరోలే మరో హీరోతో కలిసి సినిమా చేయమని అడిగితే సవాలక్ష ప్రశ్నలు వేసి, కండీషన్లు పెట్టే ఈ రోజుల్లో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే.. అది కూడా ఆ స్టార్స్ లో ఒకరు పవన్ కళ్యాణ్, మరొకరు అజిత్ అయితే.. అబ్బో ఆ కాంబినేషన్ పీక్స్ కదా... అలాంటి కాంబినేషన్ ను ఊహిస్తేనే అభిమానుల ఒళ్ళు జలదరిస్తుంది అనడంలో సందేహం లేదు.. కానీ ఆ వెంటనే అసలు ఇది జరిగే పనేనా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఇదే ప్రశ్నను లండన్ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ను ఓ అభిమాని అడగగా దానికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? 'ఇప్పటి వరకూ ఇలాంటి ప్రపోజల్ నా దగ్గరకు రాలేదు.

ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా మంచి కథతో వస్తే అజిత్ తో కలిసి తప్పక నటిస్తా' అని చెప్పారు. ఈ మాటతో అభిమానులు తెగ పొంగిపోయారు. ఈ హాట్ వార్త వినగానే సినీ ప్రముఖులు కొందరు ఇప్పటికే ఆ మల్టీ స్టారర్ గురించి చర్చల్లో కూడా మొదలుపెట్టేసి ఉండవచ్చు. పవర్ స్టార్ మరోసారి తన అహం లేని వ్యక్తిత్వాన్ని కనబర్చారు.

English summary

Pawan Kalyan gives shocking answer for to act with Ajith