మళ్లీ అదే తప్పు చేస్తున్న పవన్

Pawan Kalyan giving chance to Parvathi Menon

05:17 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan giving chance to Parvathi Menon

టాలీవుడ్ హీరోలు అందరి శైలి ఒకటైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది ఒక శైలి.. పవన్ కళ్యాణ్ ఎవరికైనా ఛాన్స్ ఇస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదీ ఒక హీరోయిన్ విషయంలో కానీ అలాగే డైరెక్టర్ విషయంలో కానీ అలాగే నటీనటులు విషయంలో కానీ పవన్ కి నచ్చాలే కానీ ఆ నటీనటులు ట్రాక్ చూడకుండానే ఛాన్స్ ఇచ్చేస్తాడు. అందుకే పవన్ సినిమాల్లో ఇప్పటికే చాలామంది మలయాళీ భామలకు పవన్ కళ్యాణ్ అవకాశాలిచ్చాడు. గుడుంబా శంకర్ లో మీరా జాస్మిన్ ని, అన్నవరం సినిమాలో అసిన్ కు ఛాన్స్ ఇచ్చాడు. సుస్వాగతం సినిమాలో దేవయానికి అవకాశమిచ్చాడు.

ఇప్పుడిదే బాటలో మరో మలయాళీ భామకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు పవన్. మొన్నటివరకు ఎస్ జే సూర్య సినిమాలో సమంతను తీసుకునే అవకాశముందని అంతా అనుకున్నారు. కానీ మలయాళీ బ్యూటీ పార్వతి మీనన్ ను పవన్ సరసన తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. ఈ విషయాన్ని ఎస్ జే సూర్య ఇంకా కన్ ఫర్మ్ చేయనప్పటికీ… ఆమెనే తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. పార్వతి మీనన్ అద్భుతమైన నటి. అందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ ఆమె హోమ్లీ లుక్స్ తోనే సమస్య. పవన్ లాంటి స్టార్ సరసన హోమ్లీగా ఉండే పార్వతిని ఫ్యాన్స్ యాక్పెప్ట్ చేస్తారా అనేదే ప్రశ్న.

పవర్ స్టార్ సరసన హీరోయిన్ ఎవరనేది ఈ నెలాఖరుకు తేలిపోనుంది. ఎవరూ ఊహించని భామల్ని తెర పైకి తీసుకురావడం పవన్ కల్యాణ్ కు అలవాటే. గతంలో ఎన్నో సినిమాల్లో ఇది రుజువైంది కూడా. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు పవన్ సరసన నటించడానికి కాల్షీట్లు పట్టుకొని రెడీగా ఉంటుంటే… పవన్ మాత్రం ఓ కొత్తమ్మాయినో… పక్కరాష్ట్రం పిల్లనో సెలక్ట్ చేస్తుంటాడు. గతంలో కొమరంపులి, పంజా, గుడుంబాశంకర్ లాంటి ఎన్నో సినిమాల విషయంలో ఇదే జరిగింది. తాజాగా ఇప్పుడు కొత్త సినిమాకు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు పవన్.

English summary

Pawan Kalyan giving chance to Parvathi Menon. Pawan Kalyan giving chance to malayalam heroine Parvathi Menon.