పంచె కట్టుతో బెజవాడలో పవన్ హల్‌చల్

Pawan Kalyan Goes With Dhoti

12:15 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Pawan Kalyan Goes With Dhoti

సినీ నటుడు , జనసేన నేత పవన్ కళ్యాణ్ పంచె కట్టుతో బెజవాడలో కాలుమోపారు. రైతు బిడ్డనేనన్న సంకేతం ఇచ్చారు. ఆంధప్రదేశ్ సిఎమ్ చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో కల్సి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కి అక్కడ ఘన స్వాగతం లభించింది. అక్కడనుంచి కారులో సిఎమ్ కాంప్ ఆఫీసుకు వచ్చారు. పంచె కట్టుతో ఉన్న పవన్ వడివడిగా అడుగులు వేస్తూ సిఎమ్ కాంప్ కార్యాలయంలోకి వెళ్ళారు. రైతు సమస్యలతో పాటూ , రాజకీయ అంశాలు కూడా సిఎమ్ తో సమావేశం సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం వుందని అంటున్నారు . దీనికి తోడు త్వరలో జరగనున్న జి హెచ్ ఏం సి ఎన్నికల గురించి కూడా చర్చించే వీలుందని భావిస్తున్నారు. ఇటీవలే జనసేన పార్టీకి తెలంగాణ లో ఎన్నికల సంఘం గుర్తింపు నిచ్చింది కూడా.

English summary

Pawan Kalyan Goes With Dhoti