ఫీజు కట్టలేని అమ్మాయికి సాయం చేసిన పవన్

Pawan Kalyan helped a college girl

04:32 PM ON 11th May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan helped a college girl

పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి హృదయంతో వార్తల్లో నిలిచాడు.. కష్టాల్లో ఉన్నవారికి పవన్ ఎప్పుడూ దేవుడు రూపంలో ఆదుకుంటాడు అని మరోసారి ఈ అమ్మాయి విషయంలో రుజువు అయ్యింది.. వివరాల్లోకి వెళ్తే.... డిగ్రీ చదువుకునే ఒక అమ్మాయి తండ్రి కొన్నాళ్ళ క్రితమే మరణించాడు. కుటుంబం గడవటమే కష్టంగా ఉన్న ఆ అమ్మాయి తన డిగ్రీ ఫీజు కట్టుకోడానికి 4000 రూపాయలు అవసరమై ట్విట్టర్ ద్వారా స్నేహితులను సహాయం కోరింది. వారు నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో వెంటనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ను ట్విట్టర్ ద్వారా సాయం కోరింది.

ఇది కూడా చదవండి: పట్టపగలే పార్కులో శృంగారం చేస్తూ దొరికిపోయిన జంట(వీడియో)

వెంటనే స్పందించిన రేణు దేశాయ్ తన మేనేజర్ ద్వారా ఆ అమ్మాయి గురించి తెలుసుకొని, నేను సహాయం చేస్తానని, వివరాలు ఇమ్మని కోరింది. వెంటనే ఆ అమ్మాయి వివరాలిచ్చి సాయం కోసం ఎదురు చూసింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ మనిషి ఒకరు ఆ అమ్మాయి చదివే కాలేజీకి వెళ్లి ఫీజు డబ్బు చెల్లించారు. అడిగిన వెంటనే సహాయం అందడంతో ఆ అమ్మాయి రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ లకు థ్యాంక్స్ చెప్పింది. రేణు దేశాయ్ కూడా ఆ అమ్మాయిని బాగా చదువుకోమని చెప్పింది. ఈ ఘటనతో పవన్ కళ్యాణ్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. అందుకే అందరూ పవన్ కళ్యాణ్ ను ప్రేమింస్తారు.. ఆరాదిస్తారు.. కొలుస్తారు..

ఇది కూడా చదవండి: అది చేస్తూ దొరికేసిన ఎయిర్ హోస్టెస్

English summary

Pawan Kalyan helped a college girl. Power Star Pawan Kalyan and Renu Desai helped a poor girl and paid her college fees.