'అ....ఆ..' లో పవన్‌ కళ్యాణ్‌!

Pawan Kalyan in A..Aa movie

02:48 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Pawan Kalyan in A..Aa movie

నితిన్‌, సమంత హీరోహీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'అ..ఆ..'. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. దాదాపు 50 రోజులు నుండి నిర్విరామంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తుంది. పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్‌ ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించబోతున్నారని టాలీవుడ్‌ లో విపరీతంగా హల్‌చల్‌ చేస్తుంది. దీనికి కారణం లేకపోలేదు త్రివిక్రమ్‌ పవన్‌కళ్యాణతో జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు తెరకెక్కించాడు.

అంతే కాకుండా వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం కూడా కుదరిందన్న విషయం తెలిసిందే. హీరో నితిన్‌ కూడా పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమాని. దీనితో త్రివిక్రమ్‌ అడిగిన వెంటనే పవన్‌ కళ్యాణ్‌ అతిధిగా కనిపించేందుకు వెంటనే అంగీకరించారని వార్తలు వినబడుతున్నాయి. ఈ విషయం ఇంకా అధికారకంగా ప్రకటించలేదు. జనవరిలో ప్రకటించే అవకాశం ఉంది. ఇది నిజమైతే గనుక పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకి నిజంగా పండుగే.

సర్దార్ గబ్బర్ సింగ్‌లో వరుణ్‌తేజ్

English summary

Pawan Kalyan playing guest role in A..Aa movie