అజిత్ సినిమాలో పవన్‌కళ్యాణ్‌!!

Pawan Kalyan in Ajith movie

06:36 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Pawan Kalyan in Ajith movie

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ప్రస్తుతం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు పవన్‌ దృష్టి ఒక తమిళ సినిమా పై పడింది. తమిళ హీరో అజిత్‌ నటించిన శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'వేదాళమ్‌'. ఈ సినిమాను పవన్‌ ఎస్‌. జె. సూర్య దర్శకత్వంలో తెలుగులోకి రీమేక్‌ చెయ్యాలని అనుకుంటున్నాడట. ఈ సినిమా తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలైంది. అక్కడ భారీ విజయం సాధించింది. పైగా ఈ సినిమా కధ తెలుగు నేటివిటికి సరిపోతుందట. అందుకే పవన్‌ దృష్టి ఈ సినిమా పై పడింది. ఇప్పటికే ఈ సినిమాని తెలుగులోకి డబ్బింగ్‌ చేయడానికి సిద్దమవుతున్నారు.

అయితే పవన్‌ రీమేక్‌ చెయ్యాలని నిర్ణయించుకుంటే డబ్బింగ్‌ ఆగిపోతుంది. వేదాళమ్‌ సినిమా కధ తెలుగులో ఎన్‌టీఆర్-తమన్నా నటించిన 'ఊసరవెల్లి' సినిమా కధకి దగ్గరగా ఉంటుందట. 'ఊసరవెల్లి' సినిమాలో హీరోయిన్‌ పాత్రని వేదాళమ్‌ సినిమాలో హీరో చెల్లెలి పాత్రగా మార్చారు. ఇంతే కాకుండా మరిన్ని మార్పులు చేసి ఈ సినిమాను విడుదల చేశారు. ఊసరవెల్లి సినిమా హీరోహీరోయిన్ల పాత్రలకూ 'వేదాళమ్‌' హీరోహీరోయిన్‌ పాత్రలకూ చాలా పోలీకలు ఉన్నాయట. వేదాళమ్‌ సినిమా ఫస్టాఫ్‌ యావరేజ్‌ గా ఉంది. అయినా సెకండాఫ్‌ లో సెంటిమెంట్‌ బాగా ఉండడంతో ఈ సినిమా భారీ విజయం సాధించింది.

English summary

Pawan Kalyan want to remake Tamil Star Hero Ajith's super hit movie 'Vedalam'. This movie want to direct by S.J. Surya.