చిరు 150వ సినిమాలో పవన్ చేసే పాత్ర తెలిస్తే షాకౌతారు!

Pawan Kalyan in Chiranjeevi 150th film

12:31 PM ON 14th June, 2016 By Mirchi Vilas

Pawan Kalyan in Chiranjeevi 150th film

అవును మీరు చూసింది నిజమే! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో కనిపించబోతున్నాడట.. ఇంతకి ఆ చిత్రంలో పవన్ పాత్ర ఏంటీ? అనే విషయం పై వివరాల్లోకి వెళితే.. చిరు హీరోగా వచ్చిన చివరి సినిమా శంకర్ దాదా జిందాబాద్. ఈ సినిమాలో పవన్ తన అన్నయ్య కోసం ఒక ఫైట్ సీన్ లో మెరిశాడు. అంతే తప్ప వీరిద్దరూ ఎప్పుడూ ఎక్కువ సేపు వెండితెర మీద కనిపించలేదు. మెగా అభిమానులకు ఆ శంకర్దాదా జిందాబాద్ సీనే పెద్ద పండగ లాంటిదైంది. అయితే ఇప్పుడు ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి మరో సినిమాలో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల గ్యాప్ తర్వాత హీరోగా నటిస్తున్న కత్తి మూవీ రీమేక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో ఓ సంచలనం చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ పాటకి చిరు-పవన్ కళ్యాణ్ కలిసి స్టెప్పులేస్తున్నట్టు సమాచారం. చిరు కేరీర్ లోనే 150వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతోన్న ఈ సినిమాకు పవన్ ఒక స్టంట్ కొరియోగ్రఫీ, డాన్స్ కొరియోగ్రఫీ చేయనున్నాడని సమాచారం. ఈ మూవీలో ఓ సాంగ్ ని స్పెషల్గా తన ఇష్టానికి తగ్గట్లుగా, అభిమానులు మెచ్చేటట్లుగా దగ్గరుండి చేయించనున్నాడని సమాచారం.

ఈ సాంగ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు అంతా తెర పై కనిపించనున్నారని, వాళ్లంతా చిరుతో కలిసి ఆడిపాడనున్నారని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.

English summary

Pawan Kalyan in Chiranjeevi 150th film