చిరు 'కత్తి'కి పవన్ పదును

Pawan Kalyan in Chiranjeevi Kathi remake

01:00 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan in Chiranjeevi Kathi remake

మెగాస్టార్‌ చిరంజీవి నటించబోయే 150వ చిత్రం 'కత్తి'. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రంలో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కూడా ఒక భాగం కాబోతున్నాడు. అంటే ఈ చిత్రంలో పవన్‌ నటించడంలేదు, కానీ ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలు పవనే దగ్గరుండి చూసుకుంటాడట. అసలు విషయంలోకొస్తే ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్‌ చరణ్‌ తేజ్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ చిత్రానికి సంబంధించి కథ ఫైనలైజేషన్‌ మరియు ఇతర విషయాలు పవనే ఓకే చేస్తాడట. గత కొంతకాలంగా చిరు పవన్‌ మధ్య మౌన యుద్దం జరుగుతుందన్న వచ్చిన వార్తలని కొట్టి పారేయడానికే ఈ మెగా బ్రదర్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నారట.

తమ పర్సనల్ విషయాలు మీడియా వరకు వెళ్ళకుండా ఉండటానికి వారు ఇలా నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండవ వివాహానికి సంబంధించిన పెళ్ళి పనుల్ని పవనే దగ్గరుండి చూసుకుంటాడని సమాచారం.

English summary

Power Star Pawan Kalyan in Chiranjeevi Kathi remake. He will finalize the script writing of the movie. This movie will direct by V.V. Vinayak.