శ్రీజ పెళ్ళికి రాలేదు కానీ.. అసిస్టెంట్ పెళ్ళికి వచ్చాడు

Pawan Kalyan in his personal costume designer marriage

01:21 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan in his personal costume designer marriage

మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే శ్రీజ రిసెప్షన్ కి గానీ, పెళ్ళికి గానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాలేదు. అయితే పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో జరిగిన తన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్‌మోర్ పెళ్ళికి మాత్రం ముఖ్య అతిధిగా వచ్చారు. 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రంలోని రెండు పాటల చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో పూర్తి కావడంతో పవన్ హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. అయితే పవన్ కి తన కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ మంచి స్నేహితుడు, సన్నిహితుడు కూడా. పవన్ నటించిన 'కొమరంపులి' చిత్రంలోని పాటలు కోసం రాజేష్ పవన్‌కు ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడట.

తన పెళ్ళికి పవర్ స్టార్ రావడంతో రాజేష్ ఆనందానికి హద్దుల్లేవ్ అట. రాజేష్ తో పాటు పవన్ అభిమానులకు కూడా చాలా ఆనందంగా ఉందట. ఎందుకంటే శ్రీజ పెళ్లిలో పవన్ ని చూడలేకపోయినా కనీసం తన కాస్ట్యూమ్ డిజైనర్ పెళ్లిలో పవన్ కనిపించడంతో అందరూ ఫుల్ ఖుషీ గా ఉన్నారు. 

1/3 Pages

English summary

Pawan Kalyan in his personal costume designer marriage. Power Star Pawan Kalyan came as a chief guest for his personal costume designer Rajesh Mor marriage.