సర్దార్‌ సెట్స్‌లో పవన్‌ కి గాయం

Pawan Kalyan injured in Sardar Gabbar Singh sets

04:53 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Pawan Kalyan injured in Sardar Gabbar Singh sets

సాధారణంగా సినిమాలలో ఫైట్స్‌ చిత్రీకరించే సమయంలో హీరోలకు కాళ్ళు బెణకడం, నడుం నొప్పెట్టడం మరియు ఇతర గాయాలు తగులుతూ ఉంటాయి. అయితే ఏ నటుడికైనా ఇలాంటివి తప్పవు. అందుకే సినిమాలలో ఫైట్స్ కోసం తాళ్ళను, లేదా డూప్‌లను వాడతారు. కానీ పైట్లు వాస్తవంగా ఉండటం కోసం స్టార్‌ హీరోలు ప్రయత్నిస్తూ కొన్ని సార్లు సాహసాలు చేస్తూ ఉంటారు. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కూడా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా సెట్స్‌ లో అదే పని చేశాడు. పవన్‌కళ్యాణ్‌ మరియు ఇతర నటుల మధ్య ఒక ఫైట్‌ సీన్‌ తీసేటప్పుడు ఒక తప్పటడుగు వల్ల పవన్‌ కు గాయమైంది, పవన్‌ కాలు బెణికింది.

వెంటనే డాక్టరును సంప్రదించగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. దీనివల్ల సినిమా ఘాటింగ్‌ ఆగిపోయింది. పవన్‌ కోలుకున్న తరువాత సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

English summary

Pawan Kalyan injured in Sardar Gabbar Singh sets. Kajal Agarwal, Raai Laxmi, Sanjana is romancing with Pawan Kalyan in this movie. Power fame Bobby is directing this film.