'పవన్‌ కళ్యాణ్‌' గొప్ప వ్యక్తి: మోహన్‌బాబు

Pawan Kalyan is a great person: Mohan Babu

07:35 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Pawan Kalyan is a great person: Mohan Babu

విలక్షణ నటుడు, కలెక్షన్‌ కింగ్‌ డా. మోహన్‌బాబు తాజాగా నటించిన చిత్రం 'మామమంచు అల్లుడుకంచు'. అల్లరి నరేష్‌, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మించగా, శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రేపు (డిసెంబర్‌ 25) విడుదలవుతుండడంతో మోహన్‌బాబు తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అభిమానులు మోహన్‌బాబుని అడిగిన ప్రశ్నలకు ఎటువంటి విసుగు లేకుండా సమాధానం ఇచ్చారు. ఈ తరం హీరోలలో తన తనయులైన మంచు విష్ణు, మనోజ్‌లే ఇష్టమని చెప్పారు.

తను నటించిన సినిమాలలో తనకిష్టమైన సినిమా 'రాయలసీమ రామన్న చౌదరి' చిత్రం తనకు బాగా ఇష్టమని చెప్పారు. నేనెప్పుడు దర్శకత్వం పై దృష్టి పెట్టలేదు, నాకు దర్శకత్వం అంటే ఇష్టం కూడా లేదు. కాకపోతే మంచి కధ కోసం ఎదురు చూస్తున్న, మంచి కధ వస్తే నేను నా కూతురు లక్ష్మీ ప్రసన్న కలిసి నటిస్తాం అని చెప్పగా ఒక అభిమాని పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ పై మీ అభిప్రాయమేంటి అని అడిగారు. అప్పుడు పవన్‌కళ్యాణ్‌ ఒక గొప్ప వ్యక్తి అని సమాధానమిచ్చారు.

English summary

Pawan Kalyan is a great person: Mohan Babu gave reply to his fan in Twitter.