ప్రపంచాన్ని గడగడలాడించే పాత్రలో పవర్ స్టార్

Pawan Kalyan is acting as a Hacker

12:09 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan is acting as a Hacker

'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి డిజాస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్.జె. సూర్య దర్శకత్వంలో నటించబోతున్నాడనే విషయం తెలిసిందే. ఇది ఖుషి కి సీక్వెల్ గా రాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అదేంటంటే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక హ్యాకర్ గా నటించబోతున్నాడట. ఎప్పుడూ కొత్త రకం సినిమాలు కోరుకుని ట్రెండ్ సెట్ చేసే పవన్ కల్యాణ్ ఇలా హ్యాకర్ నటించబోతున్నాడనే విషయం తెలిశాక పవన్ అభిమానులతో పాటు ఎంతో మందిలో ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది. బాహుబలి చిత్రం తరువాత కొత్త కథల్ని బాగా ఇష్టపడుతున్న తెలుగు అభిమానులు కి మరో కొత్త కధ రాబోతుంది అని తెలుస్తుంది.

ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర 'వికీ లీక్స్' అధినేత 'జూలియన్ అసాంజే' ని పోలి ఉండబోతుందట. ఈ లీక్స్ తర్వాత ప్రభుత్వాల్లో వచ్చిన అల్లకల్లోలాన్ని మరియు అసాంజే ఎదుర్కొన్న విపరీత పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారని సమాచారం. ఎస్.జె. సూర్య ఎంతో ఇష్టంగా మరియు ఎంతో అద్భుతంగా తయారు చేసుకున్న ఈ కథని ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ మే చివరి వారం మొదలై 2017 ప్రథమార్థంలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్, సాంకేతిక నిపుణులు, మ్యూజిక్ డైరెక్టర్, విలన్ అందరి గురించి కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు.

English summary

Pawan Kalyan is acting as a Hacker. Power Star Pawan Kalyan latest movie is in S.J. Surya direction. In this movie Pawan Kalyan is acting as a Hacker.