నెక్స్ట్ మూవీ కోసం బరువు పెరుగుతున్న పవర్ స్టార్

Pawan Kalyan is gaining weight for his next movie

10:22 AM ON 15th June, 2016 By Mirchi Vilas

Pawan Kalyan is gaining weight for his next movie

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించే సినిమాలో నటించనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్తదనం సంతరించుకున్నాడు. ఎందుకంటే, సింగపూర్ పర్యటనకు వెళ్లిన పవన్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాక తీసిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో చూస్తే పవన్ కళ్యాణ్ కొంచెం లావెక్కినట్టు కనిపిస్తున్నాడు. లావెక్కినా అతని ఆకర్షణ మత్రం ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు. అయితే తన తదుపరి సినిమాలో ఫ్యాక్షన్ లీడర్ పాత్ర పోషిస్తున్నాడని అందుకే పాత్రకు తగినట్టుగా బరువు పెరుగుతున్నాడని టాక్ నడుస్తోంది.

అంతే కాకుండా తన జుట్టును కూడా గ్రే కలర్ లో ఉంచబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభమవుతుంది. పవన్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమా కూడా పవన్ స్నేహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతకాం పై పవన్ కళ్యాణ్ క్రియేటివ్ ఆర్ట్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. మొత్తానికి సర్దార్ తర్వాత దిమ్మతిరిగే మూవీ ద్వారా మళ్ళీ ఫాన్స్ ని ఆనందపరచాలని అనుకుంటున్నాడు.

English summary

Pawan Kalyan is gaining weight for his next movie