ప్రశించే టైం ఇంకా రాలేదా?

Pawan Kalyan is not reacting in AP special status

03:22 PM ON 30th July, 2016 By Mirchi Vilas

Pawan Kalyan is not reacting in AP special status

ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పడింది. జనసేన పుట్టిందే ప్రశ్నించడానికని చెప్పిన పవన్ తీరా ఇప్పుడు ప్రశ్నించడమే మానేశాడని సెటైర్లు తరచూ వస్తున్నాయి. అయితే కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో చేసిన ప్రకటన చూసాక అయినా స్పందించకపోవడం దారుణమని అంటున్నారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తుచేస్తున్నారు. విభజన కారణంగా దారుణంగా దెబ్బతింటున్న ఏపీకి అండగా నిలిచేందుకు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నాటి యూపీఏ సర్కారు తీరును ప్రశ్నించేందుకు.. తెలంగాణ ప్రజలకు దన్నుగా నిలిచేందుకు వీలుగా పవన్ పార్టీ పెట్టారు. తెలుగు ప్రాంతాల్లోని ప్రజల పక్షాన నిలవటమే తన ధ్యేయంగా చెప్పుకున్న పవన్.. ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టినట్లుగా పలుమార్లు చెప్పుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీతో భేటీ అయిన పవన్, తర్వాత ఎన్డీయే కూటమికి ఓటు వేయాల్సిందిగా చెప్పారు. మోడీ ప్రధానిగా- చంద్రబాబు ఏపీ సీఎంగా అయితే ఏపీ ప్రజల స్థితిగతులు మారతాయంటూ ఆయన చెప్పారు. ఆయన కోరినట్లే.. కేంద్రంలో మోడీ ప్రధానిగా.. రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా అయ్యారు. తన మాటల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు తాను అండగానిలుస్తానని చెప్పిన పవన్, అందుకు తగ్గట్లే పలుమార్లు తళుక్కున మెరిసారు. అయితే కొన్నిసార్లు పవన్ వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అయ్యాయి. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశంపై తాను దృష్టి పెట్టానని.. అవసరమైన సమయంలో తాను ఈ అంశంపై స్పందిస్తానని చెప్పిన పవన్.. తాజాగా ఎందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నిస్తున్నారు. ఓపక్క ప్రత్యేక హోదా అన్నది లేదని జైట్లీ తేల్చి చెప్పిన నేపథ్యంలో.. పవన్ ఎందుకు గళం విప్పటం లేదని.. ఎందుకు ప్రశ్నించరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్లుగా చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా లేదంటూ రాజ్యసభలో కుండబద్ధలు కొట్టేసిన తర్వాత కూడా ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

English summary

Pawan Kalyan is not reacting in AP special status