నేను మంచి నటుడ్ని కాను! ఇక నటించడం ఆపేస్తా

Pawan Kalyan is saying good bye to movies

03:29 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan is saying good bye to movies

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఇంక వెండితెరకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోనే సెటిలైపోతారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలకి స్పందిస్తూ పవన్‌ గొంతు విప్పారు. అసలు విషయంలోకి వస్తే ఆన్‌లైన్‌ వీడియో ఇంటర్వ్యూస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫిలిం కాంపానియన్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ ఇటీవలే తాజాగా పవన్‌కళ్యాణ్‌ ని ఇంటర్‌వ్యూ చేసింది. ఈ ఇంటర్‌వ్యూ లో ప్రముఖ జర్నలిస్ట్‌ అనుపమ చోప్రా పవన్‌ ని ఇంటర్‌వ్యూ చేశారు. ఆమె అడిగిన ప్రశ్నలకు పవన్‌ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. అసలు పవన్‌ చెప్పిన విషయాలు ఇవే, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై సినిమాలోలాగే నిజ జీవితంలో కూడా పోరాడాలి అని అనుకున్నా అందుకే రాజకీయాల్లోకి ప్రవేశించాను.

అయితే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల నేను పూర్తి రాజకీయాల్లోకి రావడానికి కొద్ది సమయం పడుతుంది. అయితే కొద్ది రోజుల తరువాత పూర్తిగా సినిమాలు మానేసి అప్పుడు రాజకీయాలకే పరిమితమవుతా అని చెప్పారు. అయితే సినిమాలకి గుడ్‌బై చెప్పినా రచయితగా మాత్రం కొనసాగుతా అని పవన్‌ స్పష్టం చేశారు. అయితే పవన్‌ సినిమాలని ఎప్పటి నుండి మానేస్తున్నాడో అన్న విషయం పై స్పష్టత ఇవ్వలేదు. ఇంక పవన్‌ సినిమాలకి గుడ్‌బై చెప్తే అభిమానులకి నిజింగా ఇది బాధాకరమే.

English summary

Pawan Kalyan is saying good bye to movies in 2019. He want to settle in Politics only.