ఖైదీ ఫంక్షన్ కి గబ్బర్ సింగ్?

Pawan Kalyan is the chief guest for Khaidi No. 150 movie

11:59 AM ON 23rd November, 2016 By Mirchi Vilas

Pawan Kalyan is the chief guest for Khaidi No. 150 movie

సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజా మూవీ 'ఖైదీ నెంబర్ 150'పై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. పైగా చిరు 150వ మూవీ కావడం ఈ అంచనాలను మరింత పెంచేసింది. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ డిసెంబరు 18న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చెర్రీ నిర్మించడం ఒకటైతే, లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి రీఎంట్రీ ఇవ్వడంతో ఆడియో ఫంక్షన్ ని గ్రాండ్ గా చేయాలని మెగాక్యాంప్ ఆలోచిస్తోంది. మెగా హీరోలంతా కలిసి దీన్ని ఫ్యామిలీ ఫంక్షన్ గా చేయబోతున్నారని టాక్. అయితే మెగా ఫ్యామిలీకి దూరంగా వుంటున్న పవన్, ఈ ఆడియో ఫంక్షన్ కి వెళ్తాడా? లేదా అనేది అసలు పాయింట్.

మెగా అభిమానులు మాత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కి చిరంజీవి వెళ్ళాడు కాబట్టి, ఇప్పుడు అన్నయ్య కోసం పవన్ తప్పకుండా వస్తాడని చెబుతున్నారు. ఆ టైంలో షూటింగ్ నిమిత్తం ఫారెన్ కి పవన్ వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని మరికొందరి వాదన. ఏమి జరుగుతుందో చూడాలి.

English summary

Pawan Kalyan is the chief guest for Khaidi No. 150 movie