ఒక సాధారణ వ్యక్తిలా లైన్ లో నిలబడిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan is waiting in queue

05:37 PM ON 9th July, 2016 By Mirchi Vilas

Pawan Kalyan is waiting in queue

సాధారణంగా సినీ సెలబ్రిటీలకు ఉండే హంగు ఆర్భాటాలకు దూరంగా సాధారణమైన జీవితం గడిపే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈయన తాజాగా లండన్ పయనమయ్యారు. యునైటెడ్ కింగ్ డం తెలుగు సంఘం ఆరవ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు పయనమైన పవన్ కళ్యాణ్.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. ఒక సాదాసీదా షర్టు వేసుకుని, పాస్ పోర్ట్ చేత పట్టుకుని, రెండు చేతులు కట్టుకుని ఒక సామాన్యమైన వ్యక్తి మాదిరి నిల్చున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ సింపుల్ గా ఉండే పవన్ కళ్యాణ్ కు ఈ తరహా డ్రెస్సింగ్ కొత్త కాకపోవచ్చు.

అయితే తమ అభిమాన హీరోలను సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయే కాస్ట్యూమ్స్ లో చూసిన అభిమానులకు రియల్ లైఫ్ లో ఇలా దర్శనమివ్వడం కాస్త ప్రత్యేకమే. అయితే పవన్ విషయంలో అందరికీ ఓ స్పష్టత ఉంది కాబట్టి.. ఈ తరహా సన్నివేశాలు ఊహించదగినవే. అమాయకంగా ఉంటూనే ఎవరికీ అందనటువంటి రికార్డులు కొల్లగొట్టడం ఒక్క పవన్ కళ్యాణ్ కే సాధ్యం అంటున్నారు అభిమానులు. లండన్ వెళ్ళిన పవర్ స్టార్ శనివారం నాడు సదరు వేడుకలో కూచిపూడి నృత్య కళాకారులను మరియు ఇతర విశిష్ట వ్యక్తులను ప్రత్యేకంగా సన్మానించనున్నారు.

English summary

Pawan Kalyan is waiting in queue