'కడప కింగ్' పేరుతో పవన్ మూవీ లీక్...

Pawan Kalyan Kadapa King movie story leaked

03:07 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Kadapa King movie story leaked

సర్దార్ డిజాస్టర్ తర్వాత ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న్యూ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమా డైరెక్టర్ విషయంలోనూ, హీరోయిన్ విషయంలోనూ తీవ్ర సస్పెన్స్ కొనసాగిన విషయం తెలిసిందే. డైరెక్టర్ గా డాలీ, హీరోయిన్ గా శృతీహాసన్ ఫిక్స్ అయిన విషయం కూడా తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఈ నెలాఖరు నుంచి శృతిహాసన్ ఈ యూనిట్ తో జాయిన్ అవనుంది. ఇక కడప కింగ్ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీలైన్ హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే ఈ మధ్య లీకుల గొడవ కూడా బానే సాగుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. కడపలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ అయిన పవన్ కు యువకుడిగా ఉన్నపుడు ఓ లవ్ స్టోరీ ఉంటుందట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమకథ విఫలమవుతుందట. దీంతో మన హీరో పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతాడట. కొంత వయసు ముదిరిన తర్వాత పవన్ కు మరో అమ్మాయి పరిచయమవుతుందట. ఆ అమ్మాయి ప్రేమ, పెళ్లి పట్ల పవన్ కు ఉన్న ఆలోచనా విధానాన్ని మార్చి తన ప్రేమలో పడేలా చేస్తుందట. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ లవ్ స్టోరీ గుడ్ ఫీల్ కలిగిస్తుందని అంటున్నారు. ఇదే పవన్ సినిమా కథ అంటూ ఫిల్మ్ నగర్ వాసులు కూడా చర్చించుకుంటున్నారట.

English summary

Pawan Kalyan Kadapa King movie story leaked