పవన్ కళ్యాణ్ కాకినాడ మీటింగ్ లో హైలైట్స్(వీడియో)

Pawan Kalyan kakinada meeting highlights

06:41 PM ON 9th September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan kakinada meeting highlights

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 రోజులు అన్నం మానేశాడా? అవునని స్వయంగా పవన్ చెప్పాడు. శుక్రవారం కాకినాడలో జరిగిన ఆత్మగౌరవ సభలో పవన్ మాట్లాడుతూ... ఏపీ విభజన తీరుకు బాధపడి 11 రోజులు అన్నం మానేశానని లోక్ సభలో తలుపులు వేసి అడ్డువచ్చిన వారిపై దాడులు చేసి రాష్ట్రాన్ని విభజించారన్నారు. అలాగే తెలంగాణ నాయకులు సీమాంధ్ర ప్రజలను చవటలు, సన్నాసులంటే బాధేస్తుందన్నారు. సీమాంధ్ర ప్రజలను ఎందుకు తిడతారని ఒక్క కాంగ్రెస్ నేతగాని, టీడీపీ నేతగాని మాట్లాడలేదన్నారు. అలాగే ప్రాణాలను పణంగా పెట్టి గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చానన్నారు..

1/3 Pages

ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ 


భారత్ మాతాకీ జై అంటూ శుక్రవారం కాకినాడ ఆత్మగౌరవ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కంద్రంపై విరుచుకు పడ్డాడు. రెండున్నరేళ్లుగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఊరిస్తూ, తీపి కబురు వస్తుందని చెబుతూ చివరికి పాచిపోయిన రెండు లడ్డూలు ఇచ్చారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. 'వెంకయ్య నాయుడు, మోడీ కలిపి రెండు లడ్డూలు ఇచ్చారు. ఢిల్లీ లడ్డూలకంటే మన బందరు లడ్డూలు, కాకినాడ -తాపేశ్వరం కాజాలు నయం. కేంద్రం ఇచ్చే పాచిపోయిన లడ్డూలు తెలుగుదేశం ప్రభుత్వం విసిరి కొడుతుందో, తీసుకుంటుందో చూద్దాం' అని పవన్ అన్నప్పుడు సభలో చప్పట్లు మోగాయి. తిరుపతి సభకన్నా ఈసారి పవన్ కొంచెం విమర్శల డోస్ పెంచాడు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని టార్గెట్ చేయడం విశేషం.  

English summary

Pawan Kalyan kakinada meeting highlights