పవన్‌కళ్యాణ్‌ 'ఖుషి' సీక్వెల్‌??

Pawan Kalyan Kushi movie Sequel??

06:41 AM ON 15th December, 2015 By Mirchi Vilas

Pawan Kalyan Kushi movie Sequel??

ఎస్‌.జె. సూర్య తెరకెక్కించిన 'ఖుషి' చిత్రం పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తమిళంలో విజయ్‌ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్‌.జె. సూర్య పవన్‌కళ్యాణ్‌ తో రీమేక్‌ చేసి తెలుగులోనూ ఘన విజయం సాధించాడు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి చాలా కాలం తరువాత 2010లో 'కొమరం పులికి' చిత్రానికి పని చేశారు. ఈ చిత్రం అటు పవన్‌ కెరీర్‌లోనూ, ఇటు ఎస్‌.జె. సూర్య కెరీర్‌లోనూ బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తరువాత ఎస్‌.జె. సూర్య హీరోగా మారి కొన్ని సినిమాల్లో నటించాడు. అవి చెప్పుకోదగ్గ విధంగా ఆడలేదు. మళ్లీ మునపటి హిట్‌ రేంజ్‌ సాధించాలని కధని సిద్ధం చేసుకున్నాడు.

తమిళంలో విజయ్‌తో ఖుషి కి రీమేక్‌ చేసే ప్లాన్‌లో ఉన్నాడు సూర్య. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగులో పవన్‌కళ్యాణ్‌తో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించవచ్చు. పవన్‌కళ్యాణ్‌ ప్రస్తుతం 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' ఘాటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది అయిపోయాక ఖుషి సీక్వెల్‌ పట్టాలెక్కొచ్చు.

English summary

S.J. Surya wants to do Kushi Sequel with Pawan Kalyan.