పవన్ కి ఇష్టమైన పుస్తకం ఇదే..

Pawan Kalyan likes Gunturu Seshendra Sharma books

02:52 PM ON 7th July, 2016 By Mirchi Vilas

Pawan Kalyan likes Gunturu Seshendra Sharma books

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద సాహిత్య అభిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగు సాహిత్యంలో ఎన్నో పుస్తకాలు చదివిన ఆయన, పలు రాజకీయ ప్రసంగాల్లో ఆ పుస్తకాల్లోన్ని తనకిష్టమైన మాటలనే ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన 'ఆధునిక భారతం' అనే పుస్తకం తాను ఎంతగానో ఇష్టపడే పుస్తకాల్లో ఒకటని చెబుతూ వచ్చే పవన్, తాజాగా ఆ పుస్తకం రీ పబ్లిషింగ్ కోసం తన వంతు సాయాన్ని అందించడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో ఆధునిక భారతం ఎక్కడా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలోనే శేషేంద్ర శర్మ కుటుంబం ఆ పుస్తకాన్ని మళ్ళీ పబ్లిష్ చేయాలని భావించినా సరైన ఆర్థిక వనరులు లేక ఆగిపోయింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, వెంటనే పుస్తకం రీ పబ్లిషింగ్ కు కావాల్సిన ఆర్థిక సాయం అందించి ఇప్పుడు ఆ పుస్తకాలు మార్కెట్ లోకి వచ్చేలా చేశారు. నేటి యువత ఈ పుస్తకం తప్పక చదవాలని, ఇలాంటి పుస్తకాలు మరుగున పడకూడదనే ఈ పుస్తకాన్ని అందరికీ అందుబాటులో తెచ్చానని పవన్ తెలిపారు.

English summary

Pawan Kalyan likes Gunturu Seshendra Sharma books