హత్యకు గురైన ఫాన్ కుటుంబాన్ని చూసి చలించిన పవన్(వీడియో)

Pawan Kalyan meets Vinod Royals family in Tirupati

01:06 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Pawan Kalyan meets Vinod Royals family in Tirupati

ఫ్యాన్స్ వార్ లో మృతి చెందిన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని జనసేత అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఉదయం పరామర్శించారు. మూడు రోజుల క్రితం ఇద్దరు హీరోల గురించి జరిగిన ఘర్షణలో స్నేహితుడి చేతిలోనే కత్తిపోటుకు గురైన వినోద్ చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలోని రాయల్ ఇంటికి వెళ్లి తల్లిని పవన్ ఓదార్చారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమాని అయిన రాయల్ తల్లి పవన్ ను చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమెను పవన్ ఓదార్చారు. అసలేం జరిగిందో పవన్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి కుటుంబానికి తామెంత అభిమానులమో రాయల్ కుటుంబసభ్యులు పవన్ కు వివరించారు. ఈ సందర్భంగా అండగా ఉంటామంటూ వారికి పవన్ భరోసా ఇచ్చారు. మా అబ్బాయికి మీరంటే ఎంతో ఇష్టమంటూ పవన్ కు రాయల్ కుటుంబసభ్యులు ఆవేదనతో చెబుతుంటే, పవన్ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. రాయల్ ల్యాప్ టాప్ ను, ట్యాబ్, మొబైల్ ను చూపించారు. వాటిలో రాయల్ సేవ్ చేసుకున్న పవన్ ఫోటోలను, విజువల్స్ ను చూపారు. కాగా పవన్ రాక సందర్భంగా భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు సైతం అక్కడికి తరలి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary

Pawan Kalyan meets Vinod Royals family in Tirupati