పవన్ సేనాపతి ఫస్ట్ లుక్ సందడి!

Pawan Kalyan New Film Senapathi First Look Poster

09:50 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan New Film Senapathi First Look Poster

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఎస్.జె.సూర్య కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాకు టైటిల్ కన్ఫామ్ అయిందంటూ నెట్టింట్లో సందడి మొదలైంది. ఫుల్ వైట్ అండ్ వైట్ లో, బర్నింగ్ బ్రాక్ ట్రాప్ లో నిలబడి ఉన్న పవన్ ముందు "సేనాపతి" అనే టైటిల్ ఉంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నమ్మితే ప్రాణాలిస్తాడు అనే ట్యాగ్ లైన్ పెట్టారట. అయితే, ఫస్ట్ లుక్ పై అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు. ఈ సంగతటుంచి పోస్టర్ విషయానికొస్తే, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రజంటేషన్లో వస్తున్న ఈ సినిమాను గబ్బర్ సింగ్ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం. ఆకుల శివ డైలాగ్స్. ప్లాప్ బస్టర్ గా నిలిచిన 'గబ్బర్ సింగ్' గ్యాప్ ను పూరించేందుకు తన నెక్ట్స్ సినిమా శరత్ మరార్ కే ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ వేడిలోనే మరో సినిమా పైకి తీసుకొచ్చి డిస్టిబ్యూటర్లకు..ఆడియన్స్ కు న్యాయం చేయాలన్నది పవన్ ప్లాన్ గా చెప్పుకుంటున్నారు. గబ్బర్ సింగ్ బయ్యర్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా దీని ద్వారా చెల్లిస్తారన్న ఆలోచన కూడా ఉందట. సినిమా పోస్టర్ చూస్తేమాత్రం ఇది పొలిటికల్ సెటైరికల్ మూవీలా కనిపిస్తుందంటున్నారు. జనసేన పార్టీకి సేనాపతి నిజంగా సంచలనం సృష్టిస్తాడా , పొలిటికల్ గా కూడా సత్తా చాటుతాడా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి:పెళ్లి చెయ్యలేదని తల్లిని సజీవ దహనం చేసిన కొడుకు

ఇవి కూడా చదవండి:ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళిన అమ్మాయిలు డబ్బులు చాలక ఎం చేస్తున్నారో తెలుసా?

English summary

Power Star Pawan Kalyan was presently acting under the direction of S.J.Surya . The title of this movie was named as "Senapathi" and recently this movie poster was going was viral over the internet.