అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి కొత్త చిత్రం వరకు పవన్ డిఫరెంట్ లుక్స్

Pawan Kalyan new getup for his new movie

05:27 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan new getup for his new movie

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ కొత్త చిత్రం గురించి అప్పుడే హంగామా మొదలైంది. ఈ ప్రాజెక్టులో పవన్ టోటల్‌గా తన గెటప్ మార్చుతున్నట్లు వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి ఓ ఫోటో బయటకు వచ్చింది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పవన్‌కళ్యాణ్ హెయిర్.. వైట్ అండ్ బ్రౌన్ కలర్లో డిఫరెంట్‌గా ఉంది. ఈ లుక్.. డాలి తెరకెక్కించబోయే చిత్రంలోదని అంటున్నారు పవన్ వీరాభిమానులు. ఇకపోతే స్టైల్ విషయంలో పవన్ కళ్యాణ్ ను ఫాలో అయ్యే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఖుషి, తమ్ముడు లాంటి చిత్రాల తర్వాత ఆయన హెయిర్ స్టైల్ యూత్ విపరీతంగా ఫాలో అయ్యారు.

కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలోనూ రోటీన్ హెయిర్ స్టైల్ లోనే కనిపిస్తున్నారు.. అందుకే ఇప్పుడు తన స్టైల్ ని మార్చారంటున్నారు. అయితే ఇదంతా అజిత్ ఇచ్చిన సలహా మేరకు పవన్ ఇలా ఫాలో అవుతున్నాడన్న కామెంట్స్ లేకపోలేదు. గడిచిన మూడేళ్లలో తమిళ హీరో అజిత్ కూడా నేచురల్‌గా తెర పై కనిపించాడు. ఆ హీరో సినిమాల హిట్ వెనుక ఇదే రీజన్ టాక్ నడిచిన విషయం తెల్సిందే! ఫస్ట్ షెడ్యూల్ తమిళనాడులోని పొల్లాచ్చిలో జరగనుంది.  

పవన్ తన మొదటి సినిమా నుంచి భిన్న హెయిర్ స్టైల్ తో అభిమానుల్ని అలరిస్తూ వచ్చారు. పవన్ హెయిర్ స్టైల్స్ అన్ని చూడడానికి క్రింది స్లైడ్స్ చెక్ చేయండి.

1/14 Pages

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

English summary

Pawan Kalyan new getup for his new movie, Pepper and salt Hair Style