పవన్ కొత్త సినిమా ఆగిపోయినట్టేనా?

Pawan Kalyan new movie is stopped

05:06 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

Pawan Kalyan new movie is stopped

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం పై ఇప్పుడు అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అవేంటంటే ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రానికి ఎస్.జే. సూర్య దర్శకత్వం వహించాల్సి ఉండగా లాస్ట్ మినిట్ లో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో పవన్ తో 'గోపాల గోపాల' చిత్రాన్ని తెరకెక్కించిన డాలీ దర్శకుడిగా ఎంపికయ్యారు. డాలీ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాక స్క్రిప్ట్ ను చదివి చాలా మార్పులు చేర్పులు చేస్తున్నాడని సమాచారం. అయితే డాలీ చేస్తున్న మార్పులు చేర్పులు పవన్ కళ్యాణ్ కు నచ్చడం లేదట. దీంతో ఈ ప్రాజెక్టుని ఆపేయాలని పవన్ భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ముందుగా అనుకున్న దాని ప్రకారం జూలై 2 నుంచి పొల్లాచిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాలి. అయితే దీనిపై ఇప్పటివరకూ ఏ క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోతుందా లేక పట్టాలెక్కుతుందా అన్నది తెలియాలంటే ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం పవన్ కూడా పొలిటికల్ మీటింగ్ లతో, ఫారెన్ టూర్లతో బిజీగా ఉండటంతో ఇంక ఈ సినిమా ఆగిపోవచ్చన్న వార్తలు బలం పుంజుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టును ఆపి నవంబర్ నుంచి త్రివిక్రమ్ తో సినిమాను స్టార్ట్ చేయాలని పవన్ భావిస్తున్నారట.

పవర్ స్టార్ తాజా ప్రాజెక్టు కనుక నిజంగానే ఆగిపోతే పవన్ కళ్యాణ్ ను సంక్రాంతి సీజన్ లో తెరపై చూసే అవకాశం ఆయన అభిమానులు కోల్పోయినట్టే. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..

English summary

Pawan Kalyan new movie is stopped